బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న స్నేహం గురించి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితోను సల్లూ భాయ్ కి ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. ఆ కారణంగానే చరణ్ సల్మాన్ కు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయింది.  సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిరు ఇంటి ఆతిథ్యం తప్పక ఉంటుంది. చరణ్ ఎప్పుడు ముంబై వెళ్లినా సల్మాన్ ని తప్పక కలుస్తుంటాడు. తాజాగా చరణ్ స్నేహాన్ని సల్మాన్ మరింత బలపరిచాడు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన దబంగ్ -3 ప్రీ రిలీజ్ వేడుకకు చరణ్ అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఒకింత టాలీవుడ్ లో కొందరికి షాక్ కి గురి చేసింది. టాలీవుడ్ లో చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. కానీ వాటికి చరణ హాజరవడం మనం అంతగా చూసింది లేదు. కానీ ఇలా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకి ప్రమోషన్స్ కి రావడం నిజంగా ఆసక్తికరమైన విషయమే.

 

ఇక ఈ సందర్భంగా చరణ్ గురించి భాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రామ్ మాకు మద్దతుగా నిలిచారు. అతడు నా చిన్న తమ్ముడు. చరణ్ నేను.. చిరంజీవిగారు నాకు బాగా దగ్గరైన వ్యక్తులంటూ మెగాభిమానుల్లో జోష్ ని నింపాడు. ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా జేఆర్సీ సెంటర్ ప్రాంగణం మార్మోగింది. అటు మెగా అభిమానులు..ఇటు వెంకీ అభిమానులు.. మరో పక్క సల్మాన్ అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. సల్మాన్ వ్యాఖ్యలకు లవ్ యూ! అంటూ అభిమానులంతా ప్లైయింగ్ కిస్సులతో ప్రేమను చూపించారు.

 

ఇక వెంకీమామతో అనుబంధాన్ని భాయ్ ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. మామ తనకు 25 ఏళ్లుగా తెలుసని సల్మాన్ అన్నారు. వెంకీ నా క్లోజ్ ప్రెండ్. మా క్లోజ్ నెస్ కారణంగానే కలిసి ప్రయాణం చేస్తున్నాం. మీరు చూపుతున్న ప్రేమ.. ఆదరణ కి కృతజ్ఞతలు. అందరు తప్పకుండా దబంగ్-3 చూడండి... నచ్చుతుంది. ఈ వేదికపై ఎవరు మిస్సయినా దబాంగ్ 3 సాధ్యమయ్యేది కాదని సల్మాన్ వెల్లడించాడు. అయితే సల్మాన్ చర్ణ్ ని ఉద్దేశించి మాట్లాడిన ఈ మాటల వెనక పెద్ద టార్గెట్ ఉందని కొందరు అనుకుంటున్నారు. ఫ్యూచర్ లో చరణ్ సల్మాన్ కలిసి ఒక పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. అంతేఅక్దు. ఈ సినిమాని చరణ్, సల్మాన్ తమ సొంత బ్యానర్స్ పై నిర్మించే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ సెట్ అవడానికి పెద్ద కష్ఠమేమి కాదనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: