టాలీవుడ్ జక్కన్న..ధర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి సినిమాని ముందు సింగిల్ పార్ట్ గానే అనుకున్నారు. కాని కథ పెరగడంతో పాటు బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల రెండు పార్ట్ లు గా తెరకెక్కిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని భావించారు. అందుకే బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తీసుకు వచ్చారు. ఆ రెండు పార్ట్ లు కూడా సెన్షేషనల్ సక్సెస్ గా నిలిచాయి. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ముందు బాలీవుడ్ సినిమాలు కూడా నిలువలేక పోయాయి. ఒకరకంగా బాఉబలి సినిమాని జక్కన్న హాలీవుడ్ సినిమాల తల తన్నేలా తీసి మన టాలీవుడ్ సత్త ఏమిటో చూపించారు. అప్పటి నుంచి హాలీవుడ్ తో సహా అన్ని సినీ ఇండస్ట్రీలు మన తెలుగు సినిమాల వైపు ఆతృతగా చూస్తున్నాయి. 

 

ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి భారీ బడ్జెట్ తో అయినా సినిమాలని తెరకెక్కించి అంతకు అంతా రాబట్టుకోవచ్చనే భరోసా కూడా జక్కన్న ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ను సింగ్ పార్ట్ గానే మొదలు పెట్టిన జక్కన్న చివరకు రెండు పార్ట్ లుగా మార్చుబోతున్నారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించాడు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ను ఆర్.ఆర్.ఆర్ సినిమా సింగిల్ బొమ్మేనా లేదంటే బాహుబలి మాదిరిగా రెండు పార్ట్ లుగా వస్తుందా అంటూ ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా సింగిల్ బొమ్మే.. కాని డబుల్ కంటెంట్ ఉంటుందంటూ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచారు. 

 

ఈ మాట విన్న దగ్గర్నుంచి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీలో ను ఆసక్తి రెట్టింపు అయిపోయింది. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రను చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం. ఇక ఈ సినిమాలో చర్ణ్ సరసన బాలీవుడ్ బ్యూటి ఆలియ భట్ నటిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: