నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులను, తన అసిస్టెంట్స్ పై దురుసగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉంటాయి. బాలయ్య ఎప్పటికప్పుడు ఇలాంటి వివాదాస్పద చేష్టలతో మీడియాలో ఉంటూనే ఉంటాడు. షూటింగ్ లో రెగ్యులర్ గా ఎవరి మీదో ఒకరి మీద అరిచేస్తాడని..ఒక్కోసారి చేయి చేసుకుంటారని.. ఉన్నంత సేపు బాగానే ఉండి వర్క్ సరిగా అవ్వకుంటే కోపంతో ఊగిపోతాడు అనే టాక్ ఉంది. బాలయ్యకు ఉన్న ఆ చెడ్డ పేరును తొలగించేందుకు దర్శకుడు కేఎస్ రవికుమార్  బాలయ్య తరపున వకాల్తా పుచ్చుకున్నట్లున్నాడు. ఇదే విషయం లో గతంలో పూరి కూడా బాలయ్య సాఫ్ట్ నేచర్ గురించి ఆయన మనస్తత్వం గురించి చెప్పాడు. పూరి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సమయంలో బాలయ్య గురించి పూరి స్పందించారు.

 

ఇక జైసింహా తర్వాత కేఎస్ రవికుమార్ - బాలయ్య కాంబోలో రూపొందిన సినిమా 'రూలర్'. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూలర్ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన కేఎస్ రవికుమార్ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బాలకృష్ణతో వర్క్ అనుభవం గురించి చెప్పాడు. బాలకృష్ణ గారికి ముక్కుమీద కోపం ఉంటుందని ఎక్కువగా సెట్స్ లో కోపంతో ఊగిపోతాడని ఎవరిపైనో ఒకరిపైన చేయి చేసుకుంటాడని ప్రచారం జరుగుతుంది. దానిపై మీ కామెంట్ ఏంటీ అంటూ కేఎస్ రవికుమార్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అయితే రవి కుమార్ దాన్ని కొట్టి పారేశాడు. 

 

బాలకృష్ణ గారు ఎక్కువగా తన అసిస్టెంట్స్ పై మాత్రమే కోప్పడతారు. వారు ఏదైనా తప్పు చేసినా లేదంటే పని సరిగా చేయక పోయినా కూడా కోపం వస్తుంది. ఆ సమయంలో వారిపై కోప్పడ్డా ఆ తర్వాత మళ్లీ వారితో కూల్ గానే ఉంటాడు. ఇక సినిమా టెక్నీషియన్స్ విషయంలో ఆయన కూల్ గానే వ్యవహరిస్తాడని పని పట్ల చాలా నిబద్దతతో ఉంటాడు కనుక అనుకున్నది అనుకున్నట్లుగా షూట్ సాగకుంటే అప్పుడు ఆయనకు కోపం వస్తుందని దర్శకుడు కేఎస్ రవికుమార్ అన్నాడు. మొత్తానికి మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా బాలయ్య చీటికి మాటికి చిన్న విషయానికి కూడా ఇతరులను కొట్టడు అని కేఎస్ రవికుమార్ బాలయ్య తో ఉన్న అనుభవంతో చెప్పాడు. అయితే ఆయన మాటల్లో ఇన్‌డైరెక్ట్ గా బాలయ్య కొడతాడనే విషయాన్ని చెప్పినట్టు అర్థమవుతోంది. ఏదేమైనా ఎవరు ఎన్ని చెప్పినా బాలయ్య తన అసిస్టెంట్స్ మీద చేయి చేసుకుంటాడని చాలా సార్లు ప్రూవ్ అయినదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: