విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి ఎఫ్-2 తో భారీ హిట్ కొట్టాడు. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమా రావడానికి చాలా నెలల గ్యాప్ తీసుకున్నాడు. ఇక వెంకీ లేటెస్ట్ సినిమా వెంకీమామ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది తొలి మూడురోజులు. సోమ, మంగళ వారాలు కాస్త డల్ కావడం అన్నది మామూలే. అయితే థియేటర్లలో మరో ఇరవై రోజులకు పైగా వుండాల్సిన సినిమాలు లెక్క తీస్తే వెంకీమామతో కలిసి మహా అయితే అయిదు సినిమాలున్నాయి. వీటిలో దబాంగ్ ను పక్కన పెట్టొచ్చు. ఎందుకంటే అది బాలీవుడ్ సినిమా కాబట్టి. మనవాళ్ళు అంతగా పట్టించుకోరు. ఇక ప్రతిరోజూ పండగే, రూలర్, ఇద్దరిలోకం ఒకటే, వెంకీ మామ.. ఈ సినిమాలే జనవరి 9 వరకు థియోటర్స్ లో వుండేవి. 

 

కాబట్టి రోజూ అంతో ఇంతో షేర్ అయితే వస్తుంది. కానీ డెఫిసిట్ లోకి వెళ్లిపోదు. పైగా సురేష్ మూవీస్ స్వంత విడుదల కాబట్టి, థియేటర్ల ప్లానింగ్ బాగుంటుంది. సోమవారం నాటికే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో ఓ థియేటర్ తగ్గించి షేర్ డివైడ్ కాకుండా చూసుకున్నారట్ట. అంతేకాదు అన్ని చోట్లా ఇధే ప్లానింగ్ కనిపిస్తోందట. 

 

ఇదిలా వుంటే వెంకీమామ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ హడావుడి చూసిన తరువాత వెంకటేష్ క్రేజ్ అంతో ఇంతో వుంది కానీ, చాలా మంది సీనియర్ హీరోల మాదిరిగా దారుణంగా పడిపోలేదని అర్థం అయింది. వెంకీ మామ సినిమా చాలా డిలే అయింది. అయినప్పటికి సినిమా కి బాగానే కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇప్పటి నుంచి స్పీడ్ గా సినిమాలుచేయాలని వెంకటేష్.. సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం వెంకీ చేతిలో మూడు ప్రాజెక్టులు రెడీగా వున్నాయి. వీటిలో కోలీవుడ్ సూపర్ హిట్ అసురన్ రీమేక్ ముందుగా పట్టాలు ఎక్కుతుంది. ఈ సినిమా తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్న తరుణ్ భాస్కర్ ప్రాజెక్టు మొదలవుతుందట. ఈ రెండు సినిమాల తర్వాత నక్కిన త్రినాధరావు ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళుతుంది. ఈ మూడింటిని స్పీడ్ గా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: