బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీ అంటే అది మిర్చి మాత్రమే. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కథకు టైటిల్ కు పర్ఫెక్ట్ అనిపించుకుంది. యువి క్రియేషన్స్ మొదటి సినిమాగా సూపర్ హిట్ అందుకున్న మిర్చి టైటిల్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు మిర్చి టైటిల్ పెట్టాల్సింది కాదట.

 

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ హీరోగా చేసిన తూనీగ తూనీగ సినిమాకు మొదట మిర్చి అనే టైటిల్ అనుకున్నారట. అయితే ఆ సినిమాకు మధ్యలో టైటిల్ మార్చారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఆ సినిమాకు మిర్చి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేశాడు సాయి రాజేష్. సహాయక దర్శకుడిగా తనకు మొదటిగా ఇచ్చిన రెమ్యునరేషన్ 500 రూపాయల నోటు తీసుకెళ్లి లామినేషన్ చేయించి సాయి రాజేష్ తండ్రికి ఇచ్చాడట.

 

ఆయన బీరువా లాకర్ లో అది దాచారట. రీసెంట్ గా ఎందుకో అది బయట పడ్డదట. అలా సుమంత్ హీరోగా చేయాల్సిన మిర్చి టైటిల్ కాస్త ప్రభాస్ చేతిలో పడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటివరకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ మిర్చితోనే దర్శకుడిగా స్టెప్ వేసి సక్సెస్ అందుకున్నాడు. అప్పటి నుండి కొరటాల శివ సినిమా అంటే పక్కా హిట్ అనేనంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

ఇక మిర్చి టైటిల్ పెట్టాలనుకున సుమంత్ అశ్విన్ హీరోగా నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాడు. ఎమ్మెస్ రాజు కూడా నిర్మాణానికి వెన్నక్కు తగ్గడంతో సుమంత్ కు తగిన సినిమా పడట్లేదు. ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఎం.ఎస్ రాజు కొన్ని కారణాల వల్ల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: