నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రూలర్’. కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేశారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 20)న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రైతులతోనే కథకు ముడిపెట్టాడు దర్శకుడు. అందులోనే రాజకీయాలతో పాటు యాక్షన్ డ్రామాను కూడా మిక్స్ చేసాడు. ఇక ఎమోషనల్ డ్రామా రొటీన్‌గా క‌నిపించింది. బాలయ్య మరోసారి రెచ్చిపోయాడు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పిచ్చెక్కించాడు. నరుకుడు.. కాల్చుడు.. చంపుడు అన్నీ చూపించాడు కేయస్ రవికుమార్. ఫ్యామిలీ డ్రామాను పండిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్నాడు బాలయ్య. రొటీన్ స్టోరీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగే అనిపిస్తుంది.  మనం బాలయ్యను బాగా చూసుకుంటే చాలు.. ఆయనే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను చూసుకుంటాడులే అనే ధైర్యం కేయస్ రవికుమార్‌లో కనిపించింది.

 

ఇక ఈ లుక్ పై ఫ్యాన్స్ అస‌హ‌నం ఫీల‌య్యారు. ఈ స్టిల్‌లో బాల‌య్య‌కు విగ్ కుద‌ర‌లేద‌ని స్టిల్ అస‌లు బాలేద‌ని ర‌క ర‌కాల ట్రోలింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. అంతేకాదు ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు అని ద‌ర్శ‌కుడు అనుకున్నాడు కానీ, అక్క‌డ‌క్క‌డ ముడ‌త‌లు క‌నిపించి కొన్ని చోట్ల విగ్గులు, గెట‌ప్స్‌లు అస్స‌లు చూడ‌టానికి ఎబ్బెట్టుగా అనిపించాయి. ‘రూలర్’ తర్వాత బాలకృష్ణ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అంతేకాదు ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: