ఒకప్పటి బాలయ్య సినిమాలను చూస్తే బాలయ్య సినిమా విడుదల అవుతుందంటే అభిమానులకు చెప్పలేని ఆనందం. ఈ నట సింహం నోటినుండి సింహం గర్జిస్తున్నట్లుగా వచ్చే డైలాగులకు పడిపోని వారుండరు. ఏకధాటిగా సినిమా మొదలైనప్పటి నుండి చిత్రం ముగిసేవరకు సినిమా హాల్స్‌లో ఒకటే సందడి. విజిల్స్, అసలు సినిమా చూస్తున్నామనే అనుభూతికంటే బాలకృష్ణకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని ముక్కున వేలేసుకునే పరిస్దితి.

 

 

కాని అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ఆయనలో ఎంతజోష్ ఉన్నా బాలయ్యను సరిగ్గా తెరమీద చూపించలేక పోతున్నారా? కొత్త కధలు లేక పాత కధలతోనే మిక్సిలో వేసి మిక్స్ చేసి తీస్తున్నారా అనే అనుమానం అభిమానుల సందేహం అని అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా వచ్చిన సినిమా రూలర్‌.. ఈ రోజే విడుదలైన ఈ మూవీ బాలయ్య ఖాతాలో హిట్ పడేలా చేస్తుందనుకుంటే మెడలో మల్లెదండ వేసి ఆ ఘమఘమలు పీల్చుకోమన్నట్లుగా ఉందందని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

 

 

ఈయన తోటి నటులు కధల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే బాలయ్య మాత్రం ఎందుకు కధల విషయంలో ఇంత బలహీనంగా మారాడో అర్దం కావడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇకపోతే బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు దారుణమైన రిజల్ట్‌ రావటంతో అభిమానులు ఈ రూలర్‌ మీదే ఆశలు పెట్టుకున్నారు. కాని వారికి మరో సారి నిరాశను మిగిల్చారని అనుకుంటున్నారు కొందరు..

 

 

ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించగా ఈ రోజు విడుదలైనా ఈ చిత్రం సినిమా ధియోటర్లో సందడి చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: