టాలీవుడ్ లో ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన నటించి మెప్పించిన నటి విజయశాంతి.  అప్పట్లో సెంటిమెంట్, ఎమోషన్ సీన్లు పండించడంలో విజయశాంతికి ప్రత్యేకత ఉండేది.  ఆ తర్వాత యాక్షన్ తరహా సినిమాల్లో నటిస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది.  విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం జనాలకు బోర్ కొట్టింది.  దాంతో విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాయి.  అదే సమయంలో బీజేపీలో చేరడం..తర్వాత తల్లితెలంగాణ పార్టీ స్థాపించి టీఆర్ఎస్ లో విలీనం చేయడం జరిగింది.  మెదక్ ఎంపిగా కొనసాగిన విజయశాంతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ పార్టీలోచేరారు.

 

 ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు.  అయితే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్నారు విజయశాంతి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు విజయశాంతి.  ఇక అనీల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ ఏ రేంజ్ లోహిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి పోటీగా విన‌య విధేయ రామ‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వంటి పెద్ద సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికి, ఎఫ్ 2 మూవీ అశేష ప్రేక్ష‌కాద‌రణ పొందింది.

 

అయితే ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతుందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది..కానీ దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వ‌చ్చే ఏడాది ఎఫ్ 3 చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని టాలీవుడ్ టాక్.  ప్రస్తుతం వెంకటేశ్ అసురన్ సినిమా రీమేక్ లో ఉన్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత  ఎఫ్ 3 మూవీని మొద‌లు పెట్ట‌నున్నాడ‌ట అనీల్ రావిపూడి.  అయితే ఈ మూవీలో విజయశాంతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్ప‌టికే ఈ విష‌యంపై విజ‌య‌శాంతితో అనీల్ రావిపూడా మాట్లాడ‌గా, ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: