నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన  చిత్రం రూలర్. బాలకృష్ణ 105వ సినిమా గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై మొదటినుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించనంత కొత్తగా బాలయ్య గెటప్ కనిపించింది. దీంతో ప్రేక్షకులు అందరూ బాలయ్య గెటప్ కి బాగా ఆకర్షితులయ్యారు అయితే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య గెటప్ పరంగా కొత్తగా కనిపించిన సినిమా కథ మాత్రం బాలయ్య పాత సినిమా లాగే రొటీన్ గా ఉందని చెబుతున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. 

 

 

 

 ఇంతకుముందు బాలయ్య తీసిన సినిమాల లాగానే ఇది కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కేవలం బి సి ప్రేక్షకులను  ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ మాత్రం పీక్స్ లో ఉంది అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. కేవలం తన ఎనర్జీతో ని బాలయ్య సినిమా మొత్తం నెట్టుకొచ్చారు అని ప్రేక్షకుల నుండి టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ ముందు ఏ క్యారెక్టర్ కూడా నిలువలేక పోయింది అని తెలుస్తోంది. సినిమా మొత్తం బాలయ్య ఎనేర్జి...  బాలయ్య చెప్పే పంచ్ డైలాగులు.. బాలయ్య చేసే ఫైట్ లు..బాలయ్య  చేసే డాన్సు పెర్ఫార్మన్స్ లు తప్ప ఇంకే పాత్ర కూడా ప్రేక్షకులకు కనిపించదు. 

 

 

 

 బాలయ్య అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా బాలయ్య తన  ఫైట్ లతో  విలన్లను దబిడి దిబిడి చేసేసాడు. బాలయ్య ఒక్క పంచ్  చేస్తే విలన్ అందరు గాల్లోకి ఎగరడం.. కార్లు కూడా వనికి పోవడాలు ఇలాంటివి రూలర్ సినిమా లో కనిపించాయి. ఇక అదే ఊచకోత అదే రక్తపాతం సినిమాలో మరోసారి కనిపించింది. బాలయ్య కొత్తగా కనిపించిన సాఫ్ట్ గెటప్  తో కూడా మాస్ యాక్షన్ చూపించాడు సినిమాలో . ఇక ఈ సినిమా చూసిన మాస్ ప్రేక్షకులందరికీ పూనకం వచ్చేస్తోంది. ఇక బాలయ్య ఎనర్జీతో అందరూ ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇక దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కూడా సినిమా రొటీన్ కథే అయినప్పటికీ కాస్త భిన్నంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశాడు. మొత్తంగా అయితే బాలయ్య వన్ మాన్ షో తో రూలర్ ముందుకెళుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: