ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో పూనకం రావాల్సిందే... ఆయన ఒక్క పంచ్ ఇస్తే విలన్లు  గాలిలోకి ఎగురావాల్సిందే ... థియేటర్లో  ఆయన పంచ్ డైలాగులతో మొత్తం హోరెత్తి పోవాల్సిందే ... ఆయన ఇంకెవరో కాదు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ 105వ చిత్రంగా రూలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహా నాయకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో బాలయ్య అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు... అంతేకాకుండా ఈ రెండు సినిమాలలో బాలయ్య మార్క్ యాక్షన్ కనిపించకపోవడంతో రూలర్  సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు రూలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

 

 

 ఈ చిత్రంలో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు చిత్రానికి కీలకంగా మారాయి. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులందరికీ రొటీన్ కథగా అనిపిస్తూ ఉంటుంది. బాలయ్య అంతకుముందు సినిమాల్లాగే ఈ సినిమా కథ కూడా ఉంటుంది. అయితే రూలర్ సినిమాలో  పరువు హత్యలపై కూడా సోషల్ మెసేజ్ ఇచ్చాడు బాలయ్య. ఈ మధ్య సమాజంలో రోజురోజుకు పరువు హత్యలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  దీనికి సంబంధించి తన సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు బాలయ్య. ఏపీ రెవిన్యూ మినిస్టర్ భవాని  సింగ్  ఠాకూర్  అన్న ప్రకాష్ రాజ్ కూతురు  భూమిక తక్కువ కులానికి చెందిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లికి ప్రకాష్ రాజ్ అంగీకరించినప్పటికీ మంత్రిగా ఉన్న భవాని మాత్రం తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన భూమిక భర్త ని చంపేస్తాడు. 

 

 

 

 పోలీస్ ఆఫీసర్ గా ఉన్న బాలయ్య రంగంలోకి దిగి మంత్రి భవానీ నీ  అరెస్ట్ చేస్తాడు. ఇక అక్కడినుంచి భవానీప్రసాద్ బాలయ్య మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా రూలర్ సినిమా కథ మొత్తం సాగిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య యాక్షన్ సన్నివేశాలు కూడా మొదలవుతాయి. కాగా ఈ సినిమాలో బాలయ్య మార్క్ రొటీన్ మాస్ యాక్షన్ పంచు డైలాగులు ప్రేక్షకులను కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి. అయితే బాలయ్య ఎనర్జిటిక్ నటన... హీరోయిన్లు సోనాల్ చౌహాన్ వేదిక అందాలు... బాలయ్య డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులందరూ సాటిస్ఫై అవుతారు. కానీ రొటీన్ కథ కావడం.. సెకండాఫ్ సరిగా లేకపోవడం లాంటివి రూలర్ సినిమా విషయంలో జరిగాయి. రూలర్ సినిమా కేవలం బాలయ్య ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: