యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన రూలర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది తనకు జైసింహా వంటి సక్సెస్ఫుల్ సినిమాని అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య మరొక్కసారి నటించిన ఈ సినిమా తొలి షో నుండి చాలావరకు ప్రేక్షకుల పెదవి విరుపులు వినపడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని కథ మరియు కథనాలు పూర్తిగా పాత పద్దతిలో ఉండడంతో పాటు సినిమాలో పెద్దగా వైవిద్యం ఏమి లేదని, 

 

అలానే సినిమాలో చాలా వరకు యాక్షన్, ఫైట్స్ సీన్స్ వంటివి చూస్తుంటే ఇదే కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా వలె అనిపిస్తుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ చాలా వరకు బాగానే ఉందని, ఇక సెకండ్ హాఫ్ లో కథ మొత్తం రొటీన్ పద్దతిలో సాగుతుందని అంటున్నారు. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ బాగున్నప్పటికీ, ఇవి కావాలనే బాలయ్య హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఆయన ఫ్యాన్స్ కోసం పెట్టారా అని అనిపించకమానదట. అయితే సినిమాలో బాలయ్య ఎంతో అందంగా కనపడడంతో పాటు తన మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారట. 

 

సినిమాలోని మొత్తం నాలుగు పాటల్లో రెండు పాటలు చూడడానికి చాలా బాగున్నాయని, అలానే వాటిలో బాలయ్య తన మార్క్ స్టెప్పులతో అదరగొట్టారని అంటున్నారు. సినిమాలో కెమెరా పనితనం బాగుందని, ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కామెడీ వంటివి బాగున్నాయని అంటున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారని, ఓవర్ అల్ గా ప్రస్తుతం వస్తున్న ఈ టాక్ ని బట్టి చూస్తే రూలర్ యావరేజ్ గా నిలిచే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి రాబోయే రోజుల్లో ఎంతమేర ఈ సినిమా కలెక్ట్ చేస్తుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: