సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చెస్తే చాలు వాళ్ళిద్దరి మధ్య  ఏదో ఉందని వార్తలు వచ్చేస్తుంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లెకపోయినా ఈ వార్తలని నమ్మే వాళ్ళు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు ఒకే హీరోయిన్ తో పదేసి సినిమాలు చేసినా కూడా ఇలాంటి వార్తలు వచ్చేవి కావు. కాని రాను రాను కాలం మారుతోంది. సామాజిక మాధ్యమాలు వచ్చాక ఈ పోకడలకి అంతులేకుండా పోయింది.

 

అయితే కొన్ని సార్లు ఇలా వచ్చిన వార్త్లు నిజమైన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం మనం మాట్లడుకోవాల్సింది అంజలి, జై ల గురించి. హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై ఇద్దరూ కలిసి "జర్నీ" అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రి సినిమాకె హైలైట్ గా నిలిచింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయనం నడుస్తోందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి ఊతమిచ్చింది కూడా వారే.

 

రెండేళ్ల కిందట సొషల్ మీడియాలో ఒకానొక ఛాలెంజ్ లో భాగంగా తన భార్యకి దోసె చేసి ఇవ్వడమనేది హైలైట్ గా నిలిచింది. అయితే ఆ చాలెంజ్ కేవలం భార్యభర్తల మధ్య జరిగినదే. కొలీవుడ్ లో చాలామంది సెలెబ్రిటీలు ఈ ఛాలెంజికి స్పందించారు. అయితే అలా ఛాలెంజిని స్వికరించిన వారిలో అంజలి,౦ జై ల జంట కూడా ఉంది. కానీ జై, అంజ‌లిల‌కు మాత్రం పెళ్లి కాలేదు. అప్ప‌టికి వాళ్లిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

 

పెళ్లి కాకున్నా తాము భార్యాభ‌ర్త‌ల‌మే అన్న ఉద్దేశంతోనే అంజ‌లి, జై ఇలా దోసె ఛాలెంజ్ స్వీక‌రించార‌ని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదట. గత కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి ఎక్కువగా కనిపించట్లేదు. అదే ప్రశ్నని ఆమెని అడగ్గా, జైకి నాకు బ్రేకప్ అయిందని అంటున్నారు. కానీ లవ్వే లేనపుడు బ్రేకప్ ఏంటని ఎదురు ప్రశ్నించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: