నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్ సంగీతం అందించాడు. అయితే బాలయ్య బాబు సినిమా ఈరోజు విడుదల అయ్యింది. 

                           

ఈ సినిమాఫై ఎన్నో అంచనాలు పెట్టుకొని బాలయ్య బాబు సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. బాలయ్య కూడా ఎన్నో అంచనాలు పెట్టుకొని ఈ సినిమాను తీశారు. సినిమా పక్క అభిమానులకు నచ్చుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు అని ఆయన కూడా ఎంతో నమ్మకంగా చెప్పారు. ఈ సినిమా కోసం ఎన్నో ఇంటర్వ్యూలు. 

                        

అయినప్పటికీ ఎం లాభం లేదు. ఎందుకు అంటే బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలనే ఈ సినిమా కూడా ఉంది. దీంతో ఈ సినిమా చుసిన అభిమానులు పబ్లిక్ టాక్ లో ఘోరంగా మాట్లాడుతున్నారు. బాలయ్యా ఇట్టాగైతే ఎట్టాగంట ?.. సినిమాల కథలను ఇలా ఎంపిక చేసుకుంటే ఎలా బాలయ్య అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

 

కథలు ఎంచుకునే విధానం మార్చుకోండి.. లేకుంటే కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలోనూ బాలయ్య ఇదే విధంగా చిత్రాలు తీసాడు. తండ్రి మీద ప్రేమతో నాయకుడు, మహానాయకుడు చిత్రాలు తీసి సంవత్సరం ప్రారంభంలోనే నిరాశకు గురయ్యాడు బాలయ్య బాబు. అలాంటి ఈ బాలయ్య బాబు సంవత్సరం చివరిలో కూడా నిరాశకే గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: