నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే అభిమానులకు పూనకం వస్తుంది. ఇక బాలయ్య వయస్సులో తేడా వచ్చిందేమో గాని ఆయన పలికే డైలాగుల్లో మాత్రం ఏం తేడా లేదంటున్నారు అభిమానులు. ఆయన చేసే ప్రతి సినిమాలో భీభత్సమైన ఫైట్ సీన్స్ ఉండవలసిందే. అడవిలో సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో, సినిమా ధియోటర్ లో బాలయ్య చెప్పే డైలాగులు ఆడియన్స్ చెవుల్లో గింగిరులు తిరుగుతాయి..

 

 

ఇక పోతే బాలకృష్ణ తాజా సినిమా రూలర్.. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20 వ తారీఖున అంటే ఈ రోజు విడుదలైన ఈ సినిమాను కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో  జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మించగా, నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య డాన్ మరియు పోలీస్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశాడు.

 

 

ఇక బాలకృష్ణ నటించే సినిమాల్లో ఉన్న మెసేజ్ మాట అటుంచితే సగటు ప్రేక్షకున్ని అలా కాసేపు గాల్లో తేలేలా చేస్తాడు. తెరపై అన్ని గాల్లో తేలుతుంటే అవి చూస్తున్న ప్రేక్షకులు కూడా సీట్లో కూర్చోని గాల్లో తేలుతుంటాడు.. ఇక ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది బాలకృష్ణ ఎనర్జీ గురించి.. ఆయనలోని చురుకుతనం, మడమ తిప్పకుండా, నాలుక మడత పడకుండా ఎంతటి పొడవాటి డైలాగ్ అయినా అవలీలగా చెప్పడం ఆయన ప్రత్యేకత.

 

 

ఈ వయస్సులో ఆయనలో కనిపించే ఎనర్జీని చూస్తుంటే ముచ్చటేస్తుందంటున్నారు.. ఆయన మీద అమితమైన ప్రేమ ఉన్న అభిమానులు.. ఇకపోతే ఎదో ప్రేక్షకుల్ని కాసేపు తన నటనతో వారి బాధలు మరిచేలా చేస్తున్నారనిపిస్తుంది. సరదాగా రెండున్నర గంటల సినిమాలో బాలయ్య తన అభిమానుల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోక తప్పదంటున్నారు. ఆయన సినిమాలు చూస్తూ ఆయన నాడి తెలిసినవారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: