గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులు బాలయ్య బాబు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో తాజాగా వచ్చిన సినిమాలో కనిపిస్తున్నాడు. ఆ చిత్రం పేరే రూలర్.. ఈ సినిమా ఎంట్రీ సీన్ తోనే జై బాలయ్య అంటూ విజిల్స్ వేస్తున్నారు. స్టైలిష్ బిజినెస్ మెన్ గా పోలీస్ ఆఫీసర్ గా అలాగే సాధారణ వ్యక్తిలా బాలకృష్ణ తన నటనతో మరోసారి ఈలలు వేయించాడు.

 

 

ఇక డైలాగ్స్ కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ గత సినిమాలో కంటే కూడా ఈ సినిమాలో పలు రకాల వేరియేషన్స్ చూపించాడని అనుకుంటున్నారు.. ఇదే కాకుండా పూర్తి ఫిట్ నెస్ తో కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు.  ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కెఎస్.రవికుమార్ కంప్లీట్ గా ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాస్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేసినట్లు అర్ధమవుతోంది. ఇక యాక్షన్ సీన్స్ కి డైలాగ్స్ కూడా కరెక్ట్ గా సెట్టయ్యాయి. అభిమానులు కోరుకున్న బాలయ్యని రూలర్ లో పర్ఫెక్ట్ చూపించారని చెప్పవచ్చు.

 

 

ఇక ఈ మూవీలో సోనాల్ చౌహన్ గ్లామర్ షోతో పాటు వేదిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. అదీగాకుండా తొలి భాగం ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో బోర్‌ కొట్టించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

మరికొంత మంది సినిమా పూర్తిగా నిరాశపరిచిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఎనర్జీ తప్ప సినిమాలో ఇంకేంలేదంటున్నారు ప్రేక్షకులు.  ఇక మామూలుగా తెలుగు జాతి, తెలుగు భాష‌పై అదే ప్రేమ‌ను చూపించే బాలయ్య ఈ సినిమాలో కూడా అదే విధంగా అంటే యూపీలో వ్య‌వ‌సాయం చేసుకుంటున్న తెలుగు రైతుల స్టోరీతో ముందుకు సాగాడట. ఇకపోతే రైతు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉన్న బాలయ్య ఈ సినిమాతో తన కోరిక నెరవేర్చుకున్నా అని చెప్పారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: