మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో నటించిన ‘ప్రతి రోజు పండుగే’ ఈ సినిమా విడుదల అయ్యి విజయవంతంగా అభిమానులను అలరిస్తోంది. చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ మారుతీ ఈ సినిమాకి ముందు ఫుల్లు డిజాస్టర్ లో ఉండటంతో తాజాగా ఈ సినిమా ఇచ్చిన హిట్ మారుతికి మంచి క్రేజ్ మళ్ళీ మారుతి మార్కెట్ వుండేలా పదిలం చేసింది. ఈ సినిమా చేయక ముందు వరకు మారుతి చేసిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో 'ప్రతి రోజు పండగే' సినిమా మారుతి యొక్క డైరెక్షన్ మ్యాజిక్ ఏంటో చూపించడం జరిగింది. కామెడీ మరియు పంచ్ డైలాగులు అదేవిధంగా సినిమాలో కీలక క్యారెక్టర్లు విషయంలో వాళ్ళని వాడటంలో మారుతి తన మార్క్ డైరెక్షన్ చూపించాడు.

 

ముఖ్యంగా రావు రమేష్ తో మరియు రాశి కన్నా తో పలికించిన  డైలాగులు సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే అంతా బాగానే ఉన్న సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ పై మెగా అభిమానులు కొంత నిరుత్సాహం చెందారు. ప్రతి సన్నివేశానికి ప్రతి సీన్ కి సాయి ధరమ్ తేజ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఎప్పుడు ఇవ్వటం జరిగిందో అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన 'ప్రతి రోజు పండగే' సినిమా ప్రతి సన్నివేశానికి ఒకే ఎక్స్ ప్రెషన్స్ తో రొటీన్ యాక్టింగ్ చేస్తున్నాడని… సాయి ధరమ్ తేజ్ నటించిన విన్న‌ర్, ఇంటిలిజెంట్ లాంటి యాక్ష‌న్ సినిమాలు, చిత్ర‌ల‌హ‌రి లాంటి క్లాస్ సినిమాలు తాజాగా 'ప్ర‌తిరోజు పండ‌గే' సినిమా అయినా సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటున్నాయి.. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా ల‌వ్ సీన్లు, యాక్ష‌న్ సీన్లు, ఎమోష‌న్ సీన్ విష‌యంలో ఎక్స్‌ప్రెష‌న్స్ సేమ్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఉంటున్నాయి… యాక్టింగ్ లో సాయి ధరమ్ తేజ్ తన మార్క్ చూపించాలని వేరియేషన్ ఉండేలా చూసుకోవాలని ఈ విషయంలో మెగా కాంపౌండ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు అని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

 

క్లాస్ మాస్ సినిమాలకు తగ్గ విధంగా వరుణ్ తేజ్ తనలోని వేరియేషన్స్ అద్భుతంగా వెండితెరపై పండిస్తున్నాడు అని అభిమానులను అలరిస్తున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ కూడా ఎక్స్ప్రెషన్స్ విషయంలో చేంజ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: