మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రతి రోజు పండగే. ఈ సినిమాలో  రాశికన్నా సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. ఇక హీరో తాతగా  విలక్షణ నటుడు సత్యరాజ్ నటించగా కీలక పాత్రలో రావు రమేష్ నటించారు. కాగా ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కించగా...  గీతా ఆర్ట్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ప్రతి రోజు పండగే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. దీంతో సాయి ధరమ్ తేజ్సినిమా విజయంతో మరో  హిట్ తన ఖాతాలో వేసుకుని కెరీర్ని గాడిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్ కావడంతో సాయి ధరమ్ తేజ్  కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. 

 

 

 కానీ చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు సాయి ధరంతేజ్. ఇక ఇప్పుడు విడుదలైన ప్రతి రోజు పండగే సినిమాపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. కాగా  ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే కథాంశంతో తెరకెక్కినది  ఈ సినిమా. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న తన తాతను  చివరి క్షణాలు ఆనందంగా ఉంచేందుకు విదేశాల నుంచి రాజమండ్రి వచ్చిన మనవడు తన కుటుంబాన్ని మొత్తం ఒక దగ్గర చేర్చి  తాతను ఆనందంగా ఉంచేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు అనేది ప్రతి రోజు పండగే సినిమా. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ పర్ఫామెన్స్ ఇరగదీశాడు. కామెడీలో కానీ సెంటిమెంట్ లో కానీ అద్భుతంగా నటించాడు సాయి ధరమ్ తేజ్. ఇక రావు రమేష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో జీవించగలడు. హీరోయిన్ రాశి కన్నా కూడా టిక్ టాక్ ఎడిక్టు  అయిన యువతిగా బాగా నటించింది. 

 


 అయితే ప్రతి రోజు పండుగ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కామెడీ పరంగా  థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ.. ఫ్యామిలీ ఎమోషన్తో కట్టిపడేస్తుంది కూడా. ఈ సినిమాలో ఫస్టాఫ్ మొత్తం కామెడీ తో కేక పుట్టించారు దర్శకుడు మారుతి. ఇక కామెడీ సీన్ లలో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అదిరిపోయే టైమింగ్ పట్టేసాడు... ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ కి సంబంధించిన ఎమోషన్స్ ని సమపాళ్ళలో దట్టించి  ప్రేక్షకులందరినీ కట్టి పడేసాడు దర్శకుడు మారుతి. సెంటిమెంట్ సీన్లలో కూడా సాయి ధరమ్ తేజ్ తన నటనతో అందరిని ఆకర్షించాడు. మొత్తంగా ప్రతి రోజు పండగే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పండుగల మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: