నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్ సంగీతం అందించాడు. అయితే బాలయ్య బాబు సినిమా ఈరోజు విడుదల అయ్యింది. 

 

ఈ సినిమాఫై ఎన్నో అంచనాలు పెట్టుకొని బాలయ్య బాబు సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఏం సినిమా బాసు ఇది ? అని నెటిజనుల ఫీల్ అవుతున్నారు. మరి కొందరు అయితే బాలయ్య నీ సినిమాకు వచ్చి మా టైం అంత వేస్ట్ చేసుకున్నాం. మరొకసారి సినిమాకు వస్తే మాట్లాడండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

 

మరికొందరు అయితే మరి దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు ఏంటి అనుకుంటున్నారా ? అదేనండి.. బాలయ్యకు ఒక అలవాటు ఉంది కదా.. కథలు ఎంపిక సరిగ్గా చేసుకోడు. కానీ టైటిల్స్ మాత్రం ఓ రేంజ్ లో పెడుతాడు. బాలయ్య విధానం ఎలా ఉంటుంది అంటే.. ఒక యూట్యూబ్ ఛానల్ బాగా హైలెట్ అవ్వడానికి టైటిల్ ఒకటి కంటెంట్ ఒకటి ఉన్నట్టు ఉంటుంది. 

 

టైటిల్ సూపర్.. కంటెంట్ అట్టర్ ప్లాప్. అలానే ఉంటుంది అయన కథ. బాల‌య్య ఎప్పుడూ అంతే... మంచి టైటిల్స్ వేస్ట్ చేసేస్తాడు.. ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు, జై సింహా, ల‌య‌న్‌, డిక్టేట‌ర్‌, అధినాయ‌కుడు ఇలా మంచి టైటిల్స్ పెట్టినా అన్ని సినిమాలు ప్లాప్‌.. ఇప్పుడు రూల‌ర్ వంతు వచ్చింది. ఈ కథకి పెట్టాల్సిన పవర్ ఫుల్  టైటిల్ కాదు 'రూలర్', కానీ ఏం లాభం ఈ పరమ రొటీన్, బోరింగ్ సినిమాకి పెట్టి వృధా చేసేసారు. 

 

కెఎస్ రవికుమార్ బాలయ్య అభిమానుల్ని, ఊర మాస్ సినిమాలు కోరుకునే బి, సి సెంటర్ ఆడియన్స్ ని ఒక పరిధి వరకూ సంతృప్తి పరచగలిగాడే తప్ప, అన్ని వర్గాల సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అయితే ఈ సంవత్సరం బాలయ్య తీసిన మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే బాలయ్య బాబుకి ఈ సంవత్సరం కలిసి రాలేదు అని చెప్పచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: