భారీ అంచనాలతో విడుదలైన రూలర్ సినిమా థియేటర్ల ముందు బొక్క బోర్లో పడింది. దీనికి కారణం మరెవరో కాదు నటసింహ నందమూరి బాలకృష్ణ నే అంటున్నారు ఫాన్స్. ఎందుకంటే.. ఒక ఇంటర్వ్యూ లో బాలయ్యని నేటితరం సినిమాలు చూస్తారా అని ప్రశ్నించినప్పుడు..'అబ్బే. లేదండి. ఈ తరం సినిమాలు బాగుంటున్నాయి. కానీ అవి చూస్తే నాకు అలాంటివే చేయాలనిపిస్తుందేమోననే భయం. నాకు తగిన కథలు నా దగ్గరకు వస్తూనే ఉంటాయి' అని అన్నారు.

ఇదీ మన బాలయ్య ఆలోచన. అసలు నేటి యువత ఎలాంటి సినిమాలు చూస్తున్నారో.. మెచ్చుతున్నారో తెలుసుకోకుండా.. పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలే తీస్తా అంటే అవి అభిమానులకు రుచిస్తాయా? అమితాబ్ బచ్చన్ అతంటి వారే వయసుకు తగిన భిన్నమైన పాత్రలను చేస్తూ ప్రజలను అలరిస్తున్నాడు. అంతెందుకు.. మన విక్టరీ వెంకటేష్ ఫైట్లు గట్రా చేయకుండా శుభ్రంగా కథాబలం ఉన్నటువంటి 'దృశ్యం' సినిమాలో నటించి భారీ విజయం సాధించాలేదా. 'గురు' సినిమాతో అందర్నీ కట్టిపడేయలేదా? ఇటీవల కూడా వెంకీ మామ తో దూసుకెళ్తున్నాడు కదా!

https://mobile.twitter.com/NamasteCinema/status/1207971937852383233

మరి నువ్వెందుకు బాలయ్య రొటీన్ పంచ్ డైలాగులు, అవే నమ్మశక్యం కానీ ఫైట్లు, అవే సాంగ్స్ మళ్ళీ మళ్ళీ అభిమానుల మీద రుద్దుతున్నావ్. నిన్ను నమ్మి చలిలో కూడా రూలర్ సినిమా కోసం వచ్చిన వీరాభిమానులు సినిమా మధ్యలోనే లేచిపోతున్నారు బాలయ్య. ప్రతి ఒక్కరి మోహంలో నిరాశే బాలయ్య. రూలర్ సినిమా కంటే కార్తీక దీపం సీరియల్ బాగుందని అంటున్నారు బాలయ్య.

నిజం! బాలయ్య నువ్వు ఎంత మేకప్ వేసుకొని కుర్రోడిలాగా తళుక్కుమనాలని చూసినా నీలో వయసు పైబడ్డ చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా వయసు తగ్గ పాత్రలలో నటించి నందమూరి అభిమానులను అలరించు బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నన్ని ఏళ్లు నందమూరి అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేదులే కానీ నువ్వు కూడా నేటి తరం యువతకి నచ్చేట్లు సినిమా కథలను ఎంపిక చేసుకోని మమల్ని తలెత్తుకునేలా చెయ్యి బాలయ్య.

https://mobile.twitter.com/Kskgadu/status/1207961384454983680


https://mobile.twitter.com/pavan31999/status/1207959891370840065

https://mobile.twitter.com/ZakeerJagan/status/1207917982757703681


https://mobile.twitter.com/SandeepTheKING_/status/1207889783671775232

https://mobile.twitter.com/TirupatiBoxOffc/status/1207886902524661761

https://mobile.twitter.com/JagaNagAkhilFan/status/1207872790960865280

మరింత సమాచారం తెలుసుకోండి: