‘జై సింహా’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో బాలయ్య బాబు 'రూలర్' అనే సినిమా చేయడం జరిగింది. తాజాగా ఈ సినిమా ఇవ్వాళ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే సినిమా కి సంబంధించిన పాటలు మరియు ట్రైలర్ అదరగొట్టే రీతిలో ఉండటంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నందమూరి అభిమానులు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు 'మహా నాయకుడు', 'కథానాయకుడు'.. ఫ్లాప్ అయిన తర్వాత బాలకృష్ణ నటించిన ‘రూలర్’ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే సినిమా విడుదలయి ప్రస్తుతం పర్వాలేదనిపించింది.

 

ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ గురించి మీడియా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని బాలకృష్ణని అడగటం జరిగింది. గత కొంత కాలం నుండి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై రకరకాల వార్తలు వస్తున్నాయి మీరు క్లారిటీ ఇవ్వండి అంటూ బాలకృష్ణని మీడియా ప్రశ్నించగా...బాలకృష్ణ స్పందించి త్వరగా హీరో అయిపోవాలని మోక్షజ్ఞపై నేను ఒత్తిడి చేయడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తరచుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చిస్తున్నా.

 

త్వరలోనే అభిమానులంతా మోక్షజ్ఞని వెండితెరపై చూస్తారు అని బాలయ్య హామీ ఇచ్చాడు. దీంతో బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ సినిమాలకు దూరం వ్యాపారాలు మాత్రమే చేసుకుంటారని మొన్నటిదాక వార్తలు రావడంతో నిరుత్సాహ పడిపోయిన అభిమానులు తాజాగా బాలకృష్ణ చేసిన ప్రకటన కి నందమూరి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. వచ్చేస్తున్నాడు మావోడు అంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఇటీవల మోక్షజ్ఞ కి సంబంధించి ఫోటోలు చూసి సోషల్ మీడియాలో చాలా మంది ఇంకా సినిమాలకు దూరం అని అనుకున్నారు కానీ తాజాగా బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గ్యారెంటీ అని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: