తమిళ్ ఇండస్ట్రీ లో చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే తెలుగు హీరోయిన్ అంజలి మరియు తమిళ హీరో జై ప్రేమాయణం కొనసాగిస్తున్నారని. ఈ మాటలను ధ్రువ పరిచేలా బెలూన్ చిత్ర నిర్మాత షూటింగ్ సమయంలో అంజలి గదిలోనే హీరో జై ఎక్కువగా ఉండే వాడని వారిద్దరూ సహజీవనం చేశారని ఇవ్వడం అప్పట్లో పెద్ద కలకలం రేపింది. అతను అంతటితో ఆగకుండా షూటింగ్ కు డుమ్మా కొట్టి మరీ ఇద్దరూ స్వేచ్ఛగా తిరిగే వారిని సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ రూమర్లకు ఎంతో బలం చేకూర్చింది. అంతేకాకుండా అంజలి విషయంలో అందరూ సెట్ లో జాగ్రత్తగా నడుచుకోవాలని హీరో వార్నింగ్ లు ఇచ్చే వాడు అని కూడా నిర్మాత పబ్లిక్ గా చెప్పడం గమనార్హం.

 

వీటన్నిటితో పాటు ఇలా ఎంతో పెద్ద రచ్చ బయట జరుగుతున్నా అంజలి కానీ జై కానీ ఏ రోజు దీనిని ఖండించలేదు. ఇక నెక్స్ట్ స్టెప్పు పెళ్లి పీటలే అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి వారి ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టేసినట్లు చాలా కథనాలు వచ్చాయి కూడా. తాజాగా వీటన్నిటి పైన హీరో జై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించిన జై అంజలికి తనకు మధ్య వస్తున్న రూమర్లలో ఎటువంటి నిజం లేదని తనకు ఆమెకు మధ్య అఫైర్ కానీ ప్రేమ కానీ లేవని స్పష్టం చేశాడు. ఇలా అంతా ప్రచారం అయిపోయాక పెళ్లి గిల్లీ లేదని జై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

అయితే బెలూన్ నిర్మాత ఆరోపణలు చేసిన కొద్ది రోజులుగా జై మీడియా ముందకు రావడం  కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా  మారింది. అంజలి-జై మధ్య ఎఫైర్ సాగుతోందని రెండు మూడేళ్లగా ప్రచారంలో ఉంది.  కానీ ఇంతకుముందు ఎప్పుడూ స్పందించని సదరు హీరో ఉన్నట్టుండి బెలూన్ నిర్మాత వ్యాఖ్యలతో మీడియా ముందుకు  రావడం వెనక అసలు కారణం ఇంకేదైనా ఉందా? అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: