టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల అద్భుత సక్సెస్ తరువాత దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ ని సంపాదించారు. ఇక ఇటీవల ఆయన హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ హిందీలో మాత్రం బాగానే కలెక్షన్ ని రాబట్టింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఉత్తరాదిన తొలి రోజే రూ.24 కోట్ల మేర షేర్ రావడం జరిగింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 సినిమా నిన్న ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి చాలావరకు నెగటివ్ టాక్ ని మూటగట్టుకుంది. 

 

సల్మాన్ సినిమా వస్తుంది అంటేనే బాలీవుడ్ లో చాలా హడావుడి ఉంటుంది. అదీకాక దబాంగ్ సిరీస్ సినిమాలకు అక్కడ బాగానే క్రేజ్ ఉంది. కానీ అనూహ్యంగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదట. అంతేకాక ఈ సినిమా అక్కడ తొలిరోజు కేవలం రూ.20 కోట్లు మాత్రమే షేర్ ని రాబట్టిందని అంటున్నారు. సో దీనిని బట్టి ప్రభాస్ నటించిన సాహోను ఏమాత్రం సల్మాన్ దబాంగ్ టచ్ చేయలేకపోవడం, ఒకింత సల్మాన్ కు పెద్ద షాక్ ఇచ్చే అంశం అనే చెప్పాలి. ఇక సాహో తరువాత అక్కడ ప్రభాస్ కు క్రేజ్ మరింతగా పెరిగిందని, 

 

ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ తదుపరి సినిమా జాన్ కు ఇంతకుమించేలా అక్కడ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక దబాంగ్ 3 అన్ని భాషల్లో కూడా చాలా వరకు నెగటివ్ టాక్ తో రన్ అవుతుండడంతో సల్మాన్ భాయ్ కొంత ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. డాన్సర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్టోరీలో ఏమాత్రం కొత్తదనం లేదని, సినిమాలో సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగతీతగా సాగడం పెద్ద మైనస్ గా మారిందని అంటున్నారు ప్రేక్షకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: