నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన రూలర్ సినిమా నిన్న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో జయసుధ, భూమిక ముఖ్య పాత్రల్లో నటించారు. బాలకృష్ణ మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమాను సికె ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై సికల్యాణ్ నిర్మించారు. కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి చాలా వరకు నెగటివ్ స్పందన లభించిన విషయం తెలిసిందే. 

 

ఎక్కువగా మాస్, యాక్షన్ సీన్స్ తోనే సాగిన ఈ సినిమాలోని కథ, కథనాలు పాత మూస కథల మాదిరిగా సాగడంతో మెజారిటీ ప్రేక్షకులు రూలర్ పై పెదవి విరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు నేటి నుండి కలెక్షన్ కూడా మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రూలర్ దెబ్బ బాలకృష్ణతో త్వరలో సినిమాను తెరకెక్కించనున్న బోయపాటి శ్రీను మీద మరింత భారం పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ప్రధమంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించి, వాటితో రెండు భారీ ఫ్లాప్స్ మూటగట్టుకున్న బాలయ్య, ఈ రూలర్ తో మరొక అపజయాన్ని తన ఖాతాలో వేసుకునే పరిస్థితి కనపడుతుండడంతో, 

 

తప్పనిసరిగా బోయపాటితో చేయబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే బోయపాటి గత సినిమా వినయ విధేయ రామ కూడా బోల్తా కొట్టడంతో, ప్రస్తుతం అటు బాలయ్యకు ఇటు బోయపాటికి ఇద్దరికీ కూడా హిట్ అవసరం అని, కాబట్టి త్వరలో తెరకెక్కబోయే తమ కాంబో సినిమా కథ పై బోయపాటి కూడా గట్టిగా దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు. మరి ఈసారి కనీసం బోయపాటైనా బాలయ్యకు హిట్ అందిస్తారో లేదో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: