గత కొంత కాలంగా మన టాలీవుడ్ లో మల్టి స్టారర్ల ట్రెండ్ బాగా ఊపందుకున్న విషయం తెలిసిందే. బాహుబలి లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నారు. ఇక పోయిన వారం రిలీజ్ అయిన 'వెంకీమామ' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి మల్టిస్టారర్లపై పడింది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ మల్టి స్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు విన్న ఎవరైనా తేజు కి ఇలా ఎందుకనిపించిందని ఆలోచనలో పడ్డారు. అందుకు కారణం తను సోలో హీరోగా సక్సస్ అవలేకనే ఇలా మల్టిస్టారర్ మీద ఆశలు పెంచుకుంటున్నాడా..అందుకే కాంబినేషన్స్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. 

 

'ప్రతిరోజు పండగే' సినిమా ప్రమోషన్లతో మెగా హీరో తేజు బిజీ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో  మెగా హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చెయ్యాలని ఉంది అని అడిగితే..క్షణం ఆలోచించకుండా వరుణ్ తేజ్ తో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. అదే మెగా ఫ్యామిలీ కాకుండా బయటి హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చేస్తారు.. అని అడిగితే రవితేజ గారితో నటించాలని ఉందని చెప్పాడు. "మా ఇద్దరి మధ్య ఇలాంటి డిస్కషన్ చాలాసార్లు వచ్చింది. రవితేజ గారిని ఎప్పుడు కలిసినా ఆయన 'మనిద్దరం కలిసి ఒక సినిమా చేయాలబ్బాయ్' అంటూ ఉంటారు" అని చెప్పుకొచ్చాడు తేజు. మరి రవి తేజకి టాలీవుడ్ లో ఇంతమంది సీనియర్ జూనియర్ హీరోలున్నప్పటికి  తేజు తోనే ఎందుకు చేయాలనుకుంటున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. 

 

ఇక రవితేజ కు మాస్ మహారాజా అని పేరు. స్క్రీన్ మీద ఆయన ఎనర్జీనే వేరు. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీసుకు జింతాత జిత తప్పదు. ఇక  తేజు కూడా ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్. ఇద్దరూ కలిసి ఒక పవర్ ఫుల్ సినిమా చేస్తే మాస్ ప్రేక్షకులకు అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టే. మరి వీళ్ళ ఆసక్తి మేరకు ఎవరైనా ఫిలింమేకర్ ఈ ఎనర్జిటిక్ హీరోలకు తగ్గ స్క్రిప్ట్ తో సంప్రదిస్తే త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. ఇక రవితేజ కి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: