''కథలో నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్ళాలని నమ్ముతాను. స్టార్‌ హీరోల కోసం కథను రాయను. కథకు తగ్గ స్టార్‌నే నేను చూసుకుంటాను. ప్రభాస్‌, చరణ్‌, బన్నీకి.. పలానా కథ బాగుంటుందంటే అప్పుడు వారితో చేస్తానని'' దర్శకుడు మారుతీ అన్నారు.

 

సాయి ధరమ్‌ తేజ్‌, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ 'ప్రతిరోజూ పండుగే'. పల్లెటూరి నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొంది ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ మాట్లాడారు.

 

- ఈ సినిమాను 65 రోజుల్లో సినిమా తీశాం. థియేటర్లలో ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారేనేది ముందు ఆలోచించలేదు. హ్యూమన్‌ ఎమోషన్స్‌ బాగా చూస్తారనుకున్నాం. తండ్రి, కొడుకు రిలేషన్‌.. ఎక్కడైనా ఒక్కటే. ఇదే కథను మరోలా చెప్పవచ్చు. అందుకే తాత, మనవడు కాన్సెప్ట్‌తో చెప్పాం. మంచి ఎమోషన్‌ కూడా చెప్పదలిచాను. అయితే నా ఎమోషన్‌కూడా కామెడీ డామినేట్‌ చేసింది. రావురమేస్‌ టైమింగ్‌ అదిరిపోయిందంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. అంతా 'జబర్‌ద్త్‌ షోలా చెబితే.. సినిమా చూడరు. అందుకే  ఒక విషయాన్ని చర్చిద్దామని తీశాను. కానీ నవ్వించాలని తీయలేదు. అలా చేస్తే భలేభలే మగాడివోయ్‌లాంటి సినిమా వస్తుంది.

 

- ఈ చిత్రాన్ని చిరంజీవిగారు చూసి 'చాలా హెల్దీగా చేశామని మెచ్చుకున్నారు. కలెక్షన్‌ గురించి చెప్పలేను. మంచి సినిమా చేశారు. టీమ్‌ అందరికీ గుర్తిండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలోని సీన్స్‌ ఎక్కడోచోట ఎవరో ఒకరికి కనెక్ట్‌ అవుతాయని' చెప్పారు. ఇంకా చాలామంది ఎన్‌ఆర్‌ఐ ఫ్రెండ్స్‌.. చిత్రాన్ని చూసి.. వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకున్నారని చెప్పారు.

 

-    నేను చాలా కొత్త కాన్సెప్ట్‌లు తీయాలని తీస్తున్నాను. 'ఈరోజుల్లో' నుంచి నా సినిమాలు చూస్తే ఒకదానికొకటి వైవిధ్యంగా వుంటాయి. ఇక ప్రతిరోజూ పండుగే.. కథకు నా స్నేహితులద్వారా కొన్ని విన్న సంఘటనలు స్పూర్తినిచ్చాయి. ఓ ఫ్యామిలీ... విదేశాల్లో బిజీగా వుండి.. తండ్రి వెంటిలేటర్‌పై వుండగా చెప్పండి... వచ్చి కార్యక్రమాలు అయ్యేవరకు వుండి వెళతాం... అని అనడం విన్నా. ఇలాంటి వారు కూడా వుంటారనే కోణంలో కథ రాసుకుని సినిమాగా తీశాను. అయితే దిల్‌రాజుకు ఈ కథను చెబితే.. అప్పటికే 'శతమానంభవతి' తీశాను. మరలా ఇంకోటి వద్దన్నాడు. అందుకే దీనికి గీతా ఆర్ట్స్‌ కరెక్ట్‌ అనిపించింది.

 

- భవిష్యత్‌లో వెబ్‌సీరీస్‌దే రాజ్యం. థియేటర్‌ వరకు రావాలంటే ప్రేక్షకులు రాను రాను తగ్గిపోతున్నారు. హిందీలో ఇలాంటివి పట్టించుకోకుండా అగ్ర హీరోలు చేస్తున్నారు. నన్నూ కొంతమంది అడిగారు. త్వరలో చేస్తాను. ప్రస్తుతం చక్కటి లవ్‌స్టోరీతో సినిమా చేయాలనుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను.. అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: