కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ విషయమై సంచలన ఆరోపణలు చేసిన వర్ధమాన నటి శ్రీరెడ్డి, కొందరు సినిమా మేనేజర్లు మరియు కో ఆర్డినేటర్లు అవకాశాల కోసం వచ్చే అమాయకమైన అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. అయితే మొదట ఆమె మాటను మా అసోసియేషన్ వారు లక్ష్య పెట్టకపోవడంతో, అనంతరం మా అసోసియేషన్ ఆఫిస్ ముందు అర్ధ నగ్న ప్రదర్శన కూడా చేసింది. ఆ విధంగా పాపులరైన శ్రీరెడ్డి, కొన్నాళ్ల తరువాత ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహినికి గురైంది. అప్పట్లో ఆ వివాదం చాలా రోజులు సాగింది. అంతటితో ఆగని శ్రీరెడ్డి, హీరో నాని

 

సురేష్ బాబు తనయుడు అభిరాం, దర్శకుడు కొరటాల, రచయిత కోన వెంకట్, దర్శకుడు శేఖర్ కమ్ముల వంటి మరికొందరు సినిమా వారి పేర్లు బయటపెట్టి వారిపై కూడా లైంగిక నిందారోపణలు చేసింది. ఇక కొంత కాలం తరువాత హైదరాబాద్ నుండి పూర్తిగా చెన్నై కి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలువురు నటులు మరియు రాజకీయ నాయకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఇకపోతే నిన్న శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఒక వీడీయో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన కళ్యాణ్ ను దారుణాతి దారుణంగా అసభ్యంగా బూతులు తిట్టిన శ్రీరెడ్డి, సీఎం జగన్ పై పవన్ విమర్శలు చేయడాన్ని పూర్తిగాతప్పుపట్టింది. 

 

మీరు అంత మంచోళ్ళయితే మీ భార్య రేణు దేశాయ్ మిమ్మలను ఎందుకు వదిలేసారు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇక అంతటితో ఆగకుండా పవన్ పై బూతుపురాణం మొదలెట్టిన ఆ వీడియో చూస్తే నిజంగా ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. ఇక ఈ వీడియో పై కొందరు స్పందిస్తూ, మనకు ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఒక పాపులర్ హీరో, మరియు రాజకీయనాయకుడైన పవన్ గారి మీది ఈ విధంగా అసభ్యంగా బూతులు తిట్టడం దారుణం, అని, ఒకవేళ ఆయన వైఖరి కనుక శ్రీరెడ్డికేజీ నచ్చకపోతే మాములుగా విమర్శలు చేయవచ్చును కదా అని అభిప్రాయపడుతున్నారు. కాగా ఆ వీడియోపై పవన్ ఫ్యాన్స్, మరొక్కసారి శ్రీరెడ్డి పై కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: