ఫిలింఫేర్ అవార్డ్స్ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటిగా పరిగణించబతాయి. చాలా మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు 'బ్లాక్ లేడీ' (ఫిలింఫేర్ అవార్డుగా బ్లాక్ లేడీ రూపంగా ఉన్న అవార్డు ఇస్తారు) సాధించినందుకు చాలా గర్వంగా భావిస్తారు. అనసూయ కూడా తన మొదటి ఫిల్మ్‌ఫేర్‌తో చాలా సంతోషంగా ఉంది. రంగస్థలం చిత్రానికి గానూ రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకున్న నటనకు ఆమె “ఉత్తమ సహాయ నటి” విభాగంలో ఈ ఫిలింఫేర్ అవార్డు దక్కింది. రంగస్థలం చిత్రంలో అనసూయ టాప్ క్లాస్ నటనతో ఆకట్టుకుంది. సినిమాలో ఆమె నటనను విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

 

ఫిల్మ్‌ఫేర్ అందుకున్న తర్వాత అనసూయ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. ఆమె సుకుమార్, హీరో రామ్ చరణ్ మరియు నిర్మాతలకు మొదటిగా కృతజ్ఞతలు చెప్పలేదు. "అనామక అనే పదానికి అర్ధం మారింది" అంటూ ట్వీట్ చేశారు అనసూయ. అనసూయ చేసిన ఈ ట్వీట్ కు అర్ధం ఉంది, ఎందుకంటే రంగమత్త పాత్రకు మొదటగా రాశిని అనుకున్నారు కానీ ఈ పాత్రకు రాశి నో చెప్పడంతో, అనసూయను సంప్రదించారు సుకుమార్. అనసూయ తన నిజ వయస్సు కంటే చాలా ఎక్కువ వయసు ఉన్న పాత్ర పోషించడంపై మనసులో రెండో ఆలోచన ఉన్నప్పటికీ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు.

 

అనసూయ నటన వల్ల రంగమత్త పాత్రకే అందం వచ్చింది. కానీ కొన్ని వార్తా సంస్థలు, అనసూయ ఈ పాత్రకు అనర్హురాలని, సీనియర్ నటి ఈ పాత్రలో నటిస్తే పాత్రకు ఇంకా న్యాయం చేసి ఉండేవారని రాశాయి. ఇప్పుడు అనసూయ చేసిన ఈ ట్వీట్ ద్వారా ఆమెపై వ్యతిరేకంగా వార్తలు రాసిన వారికి అద్దిరిపోయే పంచ్ ఇచ్చారని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ట్వీట్ అనంతరం సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ కు హీరో రాంచరణ్ కు అలాగే చిత్ర బృందానికి రంగమత్త కృతజ్ఞతలు తెలిపింది. 

 

https://mobile.twitter.com/anusuyakhasba/status/1208448118410244096

మరింత సమాచారం తెలుసుకోండి: