దేశముదురుతో తెరంగేట్రం చేసి తెలుగు కుర్రకారుకు మస్కా కొట్టేసి చెన్నైలో సెటిలైన భామ హన్సిక...తమిళ్ లో బిజీగా ఉన్న ఈ భామ, తెలుగులో సైతం అప్పుడప్పుడు తళుక్కున మెరిసి అలరిస్తోంది.  ఈ భామ త్వరలో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే చిత్రీకరణ జరపుకుంటున్న ఓ వెబ్‌ సిరీస్‌లో హన్సిక హాట్ హాట్‌ సీన్స్‌లో కనిపించనుంది. సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల హవా కనిపిస్తోంది. అనుకున్న కథను వీలైనంత బడ్జెట్‌లో రూపొందించేందుకు వెబ్‌ సిరీస్‌లు సరైన వేదికగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అంతే కాకుండా కాస్త ఘాటైన కంటెంట్‌ను సెన్సార్‌ ఇబ్బందులు లేకుండా రిలీజ్ చేసేందుకు కూడా వెబ్‌ సరైన వేదికగా భావిస్తున్నారు. హన్సిక చివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. 

 


ఇక ఇదిలా ఉంటే... ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'మహా'లో నటిస్తోంది. జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హార‌ర్ అంశాలు ఎక్కువ‌గా ఉండ‌బోతున్నాయి.  ఈ చిత్రం నుంచి రోజుకో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ సినిమాకి మంచి హైప్‌ని తీసుకొస్తున్నారు చిత్ర యూనిట్‌. గతంలో హన్సిక సన్యాసి వేషంలో హుక్కా తాగుతూ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ తీవ్ర వివాదం సృష్టించింది. హిందూ సంఘాలు ఆ పోస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ త‌ర్వాత విడుద‌ల చేసిన పోస్ట‌ర్ హ‌న్సిక బాత్‌ట‌బ్‌లో ర‌క్తం మ‌డుగులో స్నానం చెయ్య‌డం మంచి హార‌ర్ బ‌జ్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో హ‌న్సిక మాజీ ప్రియుడు శింబుతో గెస్ట్ రోల్‌లో న‌టించ‌బోతున్నారు. ఇక వీరిద్ద‌రి ఘాటు రొమాన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. మ‌రో ప‌క్క షాక్ కూడా అవుతున్నారు. వీరిద్ద‌రూ విడిపోయిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ మాత్రం బాగానే వ‌ర్క్ అవుట్ అయింద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: