ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు, ఒకే ఒక్క సినిమా ముగ్గురి కలలని మటాష్ చేసింది. మరో సినిమా గురించి ఆలోచించేందుకు కూడా టైమ్ తీసుకునేలా చేసింది. మన్మథుడు 2 థియేటర్ల నుంచి వెళ్లిపోయి చాలా రోజులవుతోంది. ఆడియన్స్ కూడా ఈ మూవీని మరిచిపోయి చాలా నెలలు దాటింది. ట్రేడ్ మార్కెట్ అయితే కొత్త సినిమాలను లెక్కగట్టడంలో మునిగిపోయింది. కానీ ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఈ ఎఫెక్ట్ నుంచి బయటపడట్లేదు. 

 

మన్మథుడు 2 సినిమాపై రాహుల్ రవీంద్రన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. డైరెక్టర్ గా రెండో సినిమానే నాగార్జునని డైరెక్ట్ చేస్తున్నానని ఆనందపడ్డాడు. కానీ సినిమాపై వచ్చిన విమర్శలు రాహుల్ సంతోషాన్ని ఎక్కువసేపు నిలవనియ్యలేదు. అచ్చతెలుగు డైలాగులు అంటూ రాహుల్ చెప్పిన సంభాషణల్లో బూతులున్నాయని విమర్శించారు జనాలు. మొదటి సినిమా చి.ల.సౌ కి నేషనల్ అవార్డు అందుకొని.. రెండో సినిమాకే ఇలా అయ్యాడేంటని సింపథీ చూపించారు. ఈ ఇదిలోనే రాహుల్ తర్వాతి మూవీ చాలా ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఫ్లాప్ వస్తే దర్శకుడి ఖాతాలో, హిట్ వస్తే హీరో ఖాతాలో వేయడం కామన్ అని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. కానీ మన్మథుడు 2 ఫెయిల్యూర్ మాత్రం ఇలాంటి కామన్ థింగ్స్ కు చోటివ్వలేదు. రాహుల్ తో పాటు హీరోహీరోయిన్లకు సమాన వాటాలు పంచింది. 

మన్మథుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా పోష్ గా కనిపించింది కానీ.. ప్రేక్షకులను మునుపటిలా మెప్పించలేకపోయింది. ముఖ్యంగా రకుల్ లుక్ పై చాలా కామెంట్స్ వినిపించాయి. రకుల్ గ్లామర్ తగ్గిపోయిందని, ఈ హీరోయిన్ అనుష్క కంటే పెద్దావిడలా కనిపిస్తుందనే విమర్శలొచ్చాయి. ఈ ఎఫెక్ట్ తో రకుల్ కు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. స్టార్ హీరోస్ రకుల్ ని పెద్దగా పట్టించుకోవట్లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో బాలీవుడ్ నే నమ్ముకుంటోంది రకుల్. 

 

నాగార్జున అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది. ఒక సీనియర్ హీరో స్థాయిని తగ్గించుకొని ఇలాంటి డైలాగులు చెప్పాడేంటని విమర్శించారు. ఈ బాధలో మరో సినిమా స్టార్ట్ చేయకుండా సైలెంట్ అయ్యాడు నాగ్. కొన్నాళ్లు బిగ్ బాస్ సీజన్ 3లో గడిపి ఈ మధ్యనే ఓ కొత్త దర్శకుడితో సినిమా ప్లాన్ చేశాడు.

 

మన్మథుడు 2పెద్ద దెబ్బే కొట్టినా.. బిగ్ బాస్ సీజన్ 3 ఆ బాధను మర్చిపోయేలా చేసింది. కొత్త దర్శకుడితో కథా చర్చల్లో బిజీగా గడిపేస్తూ.. నాగార్జున ఫెయిల్యూర్ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డాడు. మరి రాహుల్ రవీందన్, రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడీ డిసప్పాయింట్ మెంట్ ని జయిస్తారు. మళ్లీ ఎప్పటికి బిజీ అవుతారో చూడాలి. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: