మెగా  మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ప్రతి రోజు పండగే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటించింది . అయితే ఈ సినిమాలో  విలక్షణ నటుడు సత్యరాజ్ హీరో గా  తాత  కీలక పాత్ర పోషించారు . అయితే ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కామెడీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా... మొదటినుంచీ ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ సొంతం చేసుకుంది . ప్రేక్షకులకు ముందుకు డిసెంబర్ 20న వచ్చిన ఈ సినిమా మొదటి షో  నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది . సినిమాలో  కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ పరంగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది ఈ సినిమా. 

 

 

 

 గతంలో వరుస ప్లాపులతో సతమతమైన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా విజయం తరువాత... ప్రతి రోజు పండగే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డట్లు  కనిపిస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమాలో కామెడీ ఎమోషన్స్ అంతా సమపాళ్లలో దట్టించి ప్రేక్షకుడికి ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారు. ప్రతి రోజు పండగే సినిమాలో మరోసారి మారుతి తన మార్కు చూపించాడు. అంతేకాకుండా ఈ మధ్య తెలుగు ప్రేక్షకులందరూ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన  సినిమాలన్నింటిని బాగా ఆదరిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 ఇకపోతే ప్రతి రోజు పండగే సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతు వసూళ్ళ పరంగా మంచి వసూళ్లు రాబడుతోంది ఈ సినిమా. సాయి ధరంతేజ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది ప్రతి రోజు పండగే సినిమా. శుక్రవారం తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో... 3.4 కోట్ల షేర్ రాబట్టింది ప్రతి రోజు పండుగే  సినిమా. ఇక శనివారం అత్యధికంగా 2.4 కోట్ల షేర్ ni దక్కించుకుంది ఈ సినిమా. ఇక ఆదివారం కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. సినిమాలో  కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ పాటలు ఈ సినిమా విజయానికి వెన్నుముక్కగా నిలిచాయి . అటు సాయిధరమ్తేజ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని ప్రతి రోజు పండుగే  సినిమా సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: