మన దేశంలో భిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలు ఉన్నాయి.. అలాగే ప్రార్దించే దేవుడు కూడా ఎవరి నమ్మకంని భట్టి వాళ్ళు ప్రార్థిస్తారు.. ఇపుడు తాజాగా ఒక యంగ్ హీరో మతం మార్చుకున్నట్లు ఒక ప్రచారం చెక్కర్లు కొడుతుంది..

.అతను మరెవరో కాదండి... జర్నీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి దగ్గరయిన హీరో "జై "..... అంజలికి జంట గా నటించాడు.. అమాయకత్వం తో, లవర్ కి భయపడే పాత్ర లో భలే చేసాడు. కాని తర్వాత సినిమాల్లో కనిపించలేదు.. తర్వాత ఒక రాజు ఒక రాణి సినిమాలో నయనతార బాయ్ ఫ్రెండ్ గా మెరిశాడు. ఈ హీరో అడపాదడపా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు.

 


అంజలితో కలసి చెట్టాపట్టాలేసుకున్న తిరిగిన ఈ యంగ్ హీరో మేమిద్దం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో నడుస్తున్న పుకారు కోలీవుడ్‌ మీడియాలో తరుచూ వినిపిస్తుంటుంది. తాజాగా మరో జై మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచాడు.

 

ఈ యంగ్ హీరో మతం మార్చుకున్నట్టుగా వెల్లడించాడు.తన తాజా చిత్రం కేప్‌ మారి ప్రమోషన్‌ సందర్భంగా తాను మతం మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు జై. గత ఏడేళ్లుగా తాను ఇస్లాంను పాటిస్తున్నట్టుగా వెల్లడించాడు. అయితే ఇదే విషయాన్ని ఇంటి సభ్యులకు కూడా చెప్పినట్లు తెలిపాడు.

 

కాని ఇంటి సభ్యులు జై ని మాత్రం ఏమి అనలేదట.సభ్యులు కూడా మద్ధతు తెలిపారని అన్నాడు. "ఏ దేవుడిని నమ్మకుండా ఉండే కన్నా ఏదో ఒక దేవుడిని నమ్మటం బెటర్‌" అని వాళ్లు భావిస్తునట్లు తెలిపాడు. త్వరలో జై తన పేరును "అజీస్‌ జై" గా మార్చుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంటి సభ్యులు కూడా అంగీకారం చెప్పడంతో త్వరలో పేరు కూడా మార్చుకుంటానని వెల్లడించారు..

 

జై మరియు అంజలి కి మధ్య ఉన్న సంబంధం గూర్చి ఒక దర్శకుడు పబ్లిక్ గా స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.. షూటింగ్‌లో భాగంగా జై, అంజలికి వేర్వేరు గా రూములు బుక్ చేశామని తెలిపాడు.. కానీ వారిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారన్నారు. సరే.. ఒక రూమ్ క్యాన్సిల్ చేస్తామంటే వద్దనే వారని..

 

ఈ కారణంగా రోజుకు రూ.12వేలు చొప్పున నష్ట పోయినట్లు చెప్పారు. ఒక రోజు షూట్ జరుగుతున్నప్పుడు మేడమ్ అని కాకుండా.. అంజలి అని పిలిచినందుకు నానా రచ్చ చేశాడని జై గురించి చెప్పుకొచ్చాడు.కాని ఈ జంట మాత్రం మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప వేరే ఏమి లేదని సింపుల్ గా చెప్పేసారు..

మరింత సమాచారం తెలుసుకోండి: