మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీతో పరిచయం అయినా.. ఆ మూవీ కన్నా ముందు ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది.   ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీలతో మంచి విజయం అందుకున్న ఈ కుర్ర మెగా హీరో ఆ తర్వాత వరుసగా ఆరు అపజయాలు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోవచ్చన ‘చిత్రలహరి’ మంచి విజయం అందుకున్నా సాయిధరమ్ తేజ్ శుక్రవారం రిలీజ్ అయిన ‘ప్రతిరోజూ పండగే’ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ కలిసి వచ్చాయి. మొదటి రోజే హిట్ టాక్ అందుకుంది.  

 

మూవీ రిలీజ్ రోజున బాలయ్య రూరల్, కార్తీ దొంగ రిలీజ్ అయినా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.  దాంతో ఇప్పుడు ‘ప్రతిరోజూ పండుగే’ మూవీకి వసూళ్లు కలిసి వస్తున్నాయి. ఈ మూవీ సత్యరాజ్, రావు రమేష్ నటన హైలెట్ గా నిలిచింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిరోజూ పండుగే బాగానే రాబట్టింది.  మంచి టాక్ తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండుగే మొదటిరోజు ఆంధ్రా మరియు తెలంగాణాలలో 3.4 కోట్ల షేర్ రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని సమాచారం.

 

తొలిరోజు కన్నా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.5.6 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉందని అంటున్నారు. మూడో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి కాబట్టి.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. 

ప్రతిరోజూ పండుగే కలెక్షన్ల వివరాలు :

నైజాం – 3.84 కోట్లు
సీడెడ్ – 1.11 కోట్లు
గుంటూరు – 65.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 1.35 కోట్లు
తూర్పు గోదావరి – 68 లక్షలు
పశ్చిమ గోదావరి – 52.5 లక్షలు
కృష్ణా – 62.5 లక్షలు
నెల్లూరు – 34 లక్షలు

ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 9.12 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: