ఈ మద్య చిన్న సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ల స్కిన్ షోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  లిప్ లాక్, బాత్ రూమ్, బికినీ, బెడ్ రూమ్ సీన్లలో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  ఆ తరహా పాత్రల్లో నటించిన హీరోయిన్లు కొంత కాలం మాత్రమే రాణించగలుగుతున్నారు.  కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ సత్తా చాటిన విషయం తెలిసిందే.   అయితే రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీలో పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

 

కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీ మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  దాదాపు సెమీ న్యూడ్ గా ఉన్న పోస్టర్లు హాట్ టాపిక్ గా నిలిచాయి. ‘ఆర్ ఎక్స్ 100’  మూవీలో పాయల్ రాజ్ పూత్ లిప్ లాక్, స్కిన్ షో తో బీభత్సం సృష్టించింది. రొమాంటిక్ సీన్లతో కుర్రకారుకు సెగలు పుట్టించిన హీరోయిన్ పాయల్ రాజపుత్‌. ఈ సినిమా హిట్ తో అమ్మడుకు మంచి అవకాశాలు వచ్చాయనే చెప్పాలి.  ఆ తర్వాత RDX మూవీలో కూడా ఇదే తరహాలో రెచ్చిపోయిన నటించింది.  కానీ ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని పొందింది.

 

అయితే కేవలం స్కిన్ షో తో రాణించగలమన్న అపోహలో ఉన్న పాయల్ రాజ్ పూత్ కి ‘ఆర్డీఎక్స్’ ఫ్లాప్ తో జ్ఞానోదయం అయ్యిందని అంటుంది.  ఇక నుంచి ఇలా కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు రాకపోయినా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చెయ్యాలని బావిస్తుందట పాయల్. మరి పాయల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల దర్శక, నిర్మాతలు ఛాన్సులు ఇస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం  రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తుంది. అదే కాకుండా తమిళంలో ఏంజల్ అనే సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: