మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నారు సాయి ధరంతేజ్. మొదట్లో మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు ఈ  యువ హీరో. కాగా ఈ మెగా మేనల్లుడికి   చిత్రలహరి సినిమా మంచి విజయం అందించి బూస్ట్ ఇచ్చింది. ఇక తాజాగా ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయం వైపు దూసుకు పోతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన... అందాల ముద్దుగుమ్మ  రాశి ఖన్నా నటించగా...  ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. గీత ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 


 కాగా ప్రతి రోజు పండగే సినిమా భారీ విజయంతో సాయి ధరంతేజ్ కెరీర్ గాడిలో పడ్డారు కనిపిస్తోంది. ఈ మెగా మేనల్లుడు తర్వాతి సినిమాగా సోలో బ్రతుకే సో అనే టైటిల్ తో  నిర్మితమవుతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ పూర్తి కాగానే  మరో ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు  దేవకట్టా ఈ సినిమాకు తెరకెక్కించనున్నాడని  సమాచారం. అయితే ఈ  సినిమాలో  సాయి ధరంతేజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారట . మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు దేవాకట్ట ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. 

 


 కాగా ఈ సినిమాలో సాయి ధరంతేజ్ మాస్ లుక్ తో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నట్లు  తెలుస్తోంది. ఇకపోతే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మొదటి నుంచి మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమాలకి మాస్  ఆడియన్స్ నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయి ధరంతేజ్ మరో మాస్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో ప్రేక్షకుల్లో  కూడా భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి. చూడాలి మరి తన మాస్ లుక్  తో అభిమానులను సాయి ధరమ్ తేజ్ ఎంతగా ఆకట్టుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: