టాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు విక్టరీ వెంకటేశ్.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా  ‘ఎఫ్ 2’ మూవీతో మంచి విజయం అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఎఫ్ 2’ భారీ కలెక్షన్లు సాధించింది.  కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగ చైతన్య మల్టీస్టారర్ గా రూపొందిన ‘వెంకిమామ’ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  డిసెంబర్ 13 న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల రెస్పాండ్ రావమే కాదు.. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. 

 

ఈ మద్య కొన్ని సినిమాలకు లెన్త్ ఎక్కువ ఉండటంతో ఆ సీన్లు డిటీల్ చేస్తున్నారు.  అయితే సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఆ డిటీట్ సీన్లు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇలా యూట్యూబ్ లో రిలీజ్ అయిన డిలీట్ సీన్లకు మంచి లైక్స్ కూడా వస్తున్నాయి. తాజాగా వెంకిమామ మూవీలో ఓ డిలీట్ సీన్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది.  హిందీ టీచర్‌ అయిన పాయల్‌ను తన మామ వెంకటేశ్‌ను ఒకటి చేయాలని చైతన్య చేసే ప్రయత్నాలు కితకితలు పెడుతున్నాయి...పాపం ఈ విషయం ఎవరికీ తెలియదు.  

 

మరోవైపు రాశి, చైతూకి ఒకరంటే ఒకరికి పడదు. ఈ నేపథ్యంలో రాశి తన స్నేహితురాలిని తీసుకుని పాయల్‌ వద్దకు వెళ్లి గొడవ చేస్తుంది. అక్కడ జరిగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కామెడీ సీన్‌ను కట్‌ చేసింది చిత్ర బృందం.  ఇద్దరి మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.  మొత్తానికి ఈ సీన్ చూస్తుంటే కడుపుబ్బా నవ్వుకునే విధంగా ఉంది.  సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి. బాబీ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: