ఇండస్ట్రీలో నిలబడాలంటే సక్సెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోగా ఎదగాలన్నా, ప్రొడ్యూసర్ గా గెలవాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిలబడాలన్నా, కమెడియన్ గా పేరు తెచ్చుకోవాలన్నా, దర్శకుడిగా మరో సినిమా చేయాలన్నా సక్సెస్ కావాలి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉన్నా, లేకపోయినా అందరికీ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉంటే ఆ కెరీర్ మరికొన్ని రోజులు పొడిగింపు అవుతుందే తప్ప మరోటి కాదు.

 

 

అయితే ప్రస్తుతం ఆదిసాయి కుమార్ ఒక్క హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ప్రేమ కావాలి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన ఆది మొదటి సినిమాతోనే విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత ఆది నుండి వచ్చిన చిత్రాలేవీ అంతగా విజయం సాధించలేవు. లవ్లీ, సుకుమారుడు లాంటి సినిమాలు కొంచెం ఫర్వాలేదనిపించినా అతడు చేసిన మిగతా సినిమాల పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి.

 

 

మొన్నటికి మొన్న జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి సినిమాలు చేసిన ఈ నటుడు ప్రస్తుతమ్ వరుస సినిమాలని లైన్లో పెట్టాడు. వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా, వరుసగా మూడు సినిమాలని లైన్లో పెట్టాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆది తన కొత్త చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు చేశారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో రూపొందనున్న ‘శశి’ సినిమా పోస్టర్ ఈ రోజే రిలీజైంది. అలాగే మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

 

వాటిలో ఒకటి జిబి.క్రిష్ణ డైరెక్షన్లో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి షూట్ మొదలుకానుంది. ఇక మూడవ చిత్రం నూతన దర్శకుడు శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: