రీసెంట్ గా గద్దలకొండ గణేష్ గా మంచి కమ్ర్షియల్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాకోసం రెడీ అయ్యాడు. మొదటి సినిమా నుంచి వరుణ్ ఎంచుకునే సినిమాలన్నీ డిఫ్రెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరి కంటే కాస్త భిన్నంగా కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే వరుణ్ నుంచి కంచె, ఫిదా, అంతరిక్షం..వంటి డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు వచ్చాయి. వరుణ్ కెరీర్ మొదట్లో కాస్త స్లోగా సాగినప్పటికి ఇప్పుడు మాత్రం క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. దాదాపు అరడజను సినిమాలు వరుణ్ చేతిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తెరకెక్కబోయో సినిమాలో వరుణ్ ఒక బాలీవుడ్ బ్యూటీ మీద ఆసక్తిగా ఉన్నాడట.

 

సయీ మంజ్రేకర్ .. దర్శక నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె. ఇటీవలే  రిలీజైన 'దబంగ్ 3' సినిమాలో యువ చుల్ బుల్ పాండే(సల్మాన్ )కి లవర్ గా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీని టాలీవుడ్ ఆఫర్లు వరిస్తున్నాయని సమాచారం. ముందుగా మెగా కాంపౌండ్ లో క్రేజీ హీరో సరసన జాక్ పాట్ కొట్టేసిందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఛాన్సిచ్చింది ఎవరు.. అనుకుంటున్నారా...! మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ యంగ్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుందని తాజా సమాచారం. ఇప్పటికే వరుణ్ ఈ సినిమాలో నటించేందుకు ప్రీ ప్రిపరేషన్ లో ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈసారి బాక్సింగ్ నేపథ్యంలో సినిమా కాబట్టి చాలా హార్డ్ గా ప్రిపేరవుతున్నాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ సీరియస్ గా సాగిస్తున్నాడు.

 

ఇక నటించిన మొదటి సినిమా తోనూ సయీ మంజ్రేకర్ పేరు బాలీవుడ్ లో మార్మోగింది. దీంతో ఆమె పై ఇటు సౌత్ దర్శక నిర్మాతల కళ్లు పడ్డాయి. క్యూట్ చబ్బీ బ్యూటీ ఆరంగేట్రమే కవ్వించే అందాల తో మతి చెడ గొట్టింది. అందానికి అందం సెక్సప్పీల్ పర్ఫెక్ట్ గా ఉన్నాయన్న టాక్ బాగా వైరల్ అయింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ దర్శకులు వెంటపడుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు పూరి కూడా ఫైటర్ లో విజయ్ సరసన నటింపజేయడానికి ట్రై చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: