క్యాస్టింగ్ కౌచ్ విషయమై మన టాలీవుడ్ సినిమా రంగంలో పలువురు ఇక్కడి ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు, అమాయకంగా కొందరు మేనేజర్లు మరియు మూవీ కోఆర్డినేటర్లును నమ్మి, లైంగిక వేధింపులకు గురవుతున్నారని అప్పట్లో నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఎంతో సంచలనం రేపాయి. ఆ తరువాత మా అసోసియేషన్ వారు శ్రీరెడ్డిని మూవీ సంఘం నుండి డిస్మిస్ చేయడం, దానితో ఆమె ఏకంగా అర్ధం నగ్న ప్రదర్శనకు దిగడంతో మళ్ళి ఆమెను అసోసియేషన్ లోకి తీసుకున్నారు. ఆ ఘటన తరువాత బాగా పాపులరైన శ్రీరెడ్డి, అనంతరం నిర్మాత డి సురేష్ బాబు తనయుడు అభిరాం, 

 

హీరో నాని, సహా మరికొందరు సినిమా ప్రముఖులు తనను లైంగికంగా ఇబ్బందులకు గురి చేసారని సంచలన ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా, ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా తప్పుగా మాట్లాడి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురైంది. ఆ గొడవ సర్దుమణిగిన తరువాత, తన మకాంని పూర్తిగా చెన్నైకి మార్చిన ఈ భామ, ఇప్పటికీ కూడా కొందరు సినీ, రాజకీయ నాయకులపై తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సెటైర్స్ పేలుస్తూనే ఉంది. ఇకపోతే అతి త్వరలో తాను శ్రీ రెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాణ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నానని, అయితే ఆ సంస్థ ద్వారా ముందుగా తమిళ యువతకు మాత్రమే అవకాశమని, ఆ తరువాతనే మన తెలుగు వారికి అవకాశాలు కల్పిస్తాను అని అంటోంది. తాను గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో, 

 

అలానే పలు షోల్లో నటించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కావున తన మాదిరిగిగా వేరే ఏ అమ్మాయి కూడా బాధలు పడకూడదనే తాను ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తున్నట్లు చెప్పింది. అంతేకాక తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఎందుకంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న తనకు పెళ్లి పై పెద్దగా ఆసక్తి లేదని అంటోంది. అయితే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తోంది తనవంతుగా సామాజిక సేవ చేయడానికేనని, ఈ విధంగా అయినా అమ్మాయిలకు ఎంతో కొంత అవకాశం కల్పించిన దానిని అవుతానని అంటోంది శ్రీరెడ్డి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: