అతి తక్కువ కాలంలో టాలీవుడ్ క్రేజీ హీరోగా యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో విజయ్ బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ ఇయర్ వచ్చిన డియర్ కామ్రేడ్ నిరాశ పరచగా ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. 

 

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ లో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ నలుగురు హీరోయిన్స్ కు సంబందించిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమా రిలీజ్ 2020 ఫిబ్రవరి 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. కెఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను మూన్ షైన్ సినిమాస్ వారు భారీ మొత్తంతో కొన్నారట. విజయ్ కెరియర్ లో ఈ సినిమా ఎక్కువ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. 

 

సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ త్రేసా, ఇజాబెల్లా నటిస్తున్నారు. సినిమాలో ఈ నలుగురితో విజయ్ చేసే లవ్ అండ్ రొమాన్స్ సినిమాకు హైలెట్ గా ఉంటాయట. అందుకే ఈ సినిమా తప్పకుండా విజయ్ ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రియులను అలరిస్తుందని అంటున్నారు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. 

 

సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ కి ఫైటర్ అని టైటిల్ డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది. పూరి తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. వరుస క్రేజీ సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్స్ కు సైతం షాక్ ఇస్తున్నాడు. ఫేమస్ లవర్ హిట్ అయితే విజయ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: