దర్శకుడు మారుతి... ఈ రోజుల్లో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యారు ఈయన. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులకు చేరువయ్యారు దర్శకుడు మారుతి. ప్రతి సినిమాలో తనదైన మార్కును ప్రదర్శిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు దర్శకుడు మారుతి. ఇక మారుతి సినిమా వస్తుందంటే సినిమా చూడొచ్చు అనే నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకుల్లో కలిగించారు ఆయన. దర్శకుడు మారుతి సినిమా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన సినిమా ఉంటుందని... ప్రేక్షకుల భావన. రొటీన్గా కాకుండా భిన్నంగా మారుతి సినిమాలు ఉంటాయని ప్రతి తెలుగు ప్రేక్షకుడు భావిస్తాడు. అందుకే మారుతి సినిమాలంటే తప్పకుండా ప్రేక్షకుడు సినిమా చూడాలని అనుకుంటాడు. 

 

 

 

 వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు మారుతి. తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది... అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... సినిమాలో కామెడీ తో అందరినీ కడుపుబ్బ నవ్వించడంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో  అందరినీ కట్టిపడేస్తుంది. ఇకపోతే తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు మారుతి ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

 

 

 

 ప్రేమ కథ చిత్రం సినిమాకి తానే దర్శకత్వం వహించానని మారుతి తెలిపారు. ముందు ఈ సినిమా చూసిన వాళ్ళు ఇదేం సినిమా రా బాబు నా మాట విని నీ పేరు వేసుకోకు కెమెరామెన్ పేరు దర్శకుడి పేరుగా వేసేయ్ లేదంటే నువ్వు ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు  మొత్తం పోతుంది అని తెలిపారని  మారుతీ  చెప్పుకొచ్చారు. ఈ సినిమా పోతే కెరియర్ పరంగా వెనక్కి వెళ్ళిపోతానెమో  అనే  భయం తో దర్శకుడిగా కెమెరామాన్ పేరు వేశాను అని మారుతి తెలిపారు. అయితే సినిమా ప్రమోషన్స్ మాత్రం మారుతి సినిమా అన్నట్లుగానే ప్రమోషన్స్ చేశామని. ముందు నుంచి తాను అనుకున్నట్లుగానే సినిమా మంచి హిట్ అయిందని మారుతి చెప్పుకొచ్చారు. అప్పుడు నాకు అర్థమైందని... తీసేసి చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని... ఈ సినిమా ద్వారా ఓ గుణపాఠం నేర్చుకున్న అంటూ మారుతి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: