మెగాబ్రదర్ నాగబాబు మరోమారు వార్తల్లో నిలిచారు. నాగబాబు ఈటీవీ లో ప్రసారమయ్యే ఫేమస్ కామెడీ షో జబర్దస్త్ నుంచి వైదొలిగి జీ తెలుగు లో ప్రసారమవుతున్న 'అదిరింది' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఇక యూట్యూబ్ లో నా ఛానల్ నా ఇష్టం అంటూ తన అభిప్రాయాలు పంచుకుంటూ వస్తున్న నాగబాబు జబర్దస్త్ కామెడీపై షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

అదిరింది కామెడీ షో ఈ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం అయింది. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చమ్మక్ చంద్ర తమ స్కిట్స్‌తో ప్రేక్షకులను అలరించారు. షో పట్ల నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అదిరింది షోకి పోటీగా జబర్దస్త్ ను కూడా ఈటీవీ లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేశారు. సాధారణంగా ఈటీవీలో జబర్దస్త్ గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఆదివారం ఎప్పుడూ ప్రసారం కానీ జబర్దస్త్ ఈ ఆదివారం రాత్రి ప్రసారం కావడంతో కొంత ఆశ్చర్యం నెలకొంది.

 

దీనిపై స్పందించిన నాగబాబు మల్లెమాల, డైరెక్టర్స్ నితిన్, భరత్ లు సక్సెస్ కాకుండా చూడాలని చూస్తోందని ఆరోపించారు. జీ టీవీ అదిరింది షోను జబర్దస్త్ కు పోటీగా ప్రసారం చేయకుండా నిర్ణయించిందని కానీ మల్లెమాల మాత్రం అదిరింది షోకు పోటీగా జబర్దస్త్ ను ఆదివారం ప్రసారం చేసింది. మల్లెమాల పోటీతత్వం మెచ్చుకుంటున్నా. ఇకపై అదిరింది షో కూడా గురు, శుక్రవారాల్లో ప్రసారం చేసే నిర్ణయాన్ని పరీశీలిస్తున్నాం వీలైనంత తొందరగా గురు, శుక్రవారాల్లో అదిరింది షోను ప్రసారం చేస్తామని నాగబాబు స్పష్టం చేశారు. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని జబర్దస్త్ నిర్వాహకులకు చురకలు అంటించారు నాగబాబు. ఇకపై అదిరింది షో గురు, శుక్రవారాల్లో ప్రసారం కానున్న నేపథ్యంలో జబర్దస్త్ కు అదిరింది షోకు మధ్య పోటీ రసవత్తరం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: