సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ఇమేజ్ ని సంపాదించుకున్న అనుష్క శెట్టి హీరోలకు ధీటుగా స్టార్ శం ని సంపాదించుకుంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తోంది. గత కొంతకాలం గా లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న స్వీటీ, నెక్ట్స్ సినిమాలో మరోసారి మెస్మరైజ్‌ చేసేందుకు రెడీఅవుతోంది. ప్రస్తుతం నిశ్శబ్ధం అనే క్రాస్‌ ఓవర్‌ సినిమాలో నటిస్తోంది అనుష్క. హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క పెయింటర్‌గా కనిపించనుంది.

 

అంతేకాదు ఇదొక అంధురాలి పాత్ర అని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మాధవన్‌, అజంలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌లతో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్‌ మ్యాడ్సన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి రచయిత కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఇక గతంలో కోన వెంకట్ నిర్మించిన సినిమాలన్ని మంచి కమర్షియల్ సక్సస్ ను సాధించినవే. కాబట్టే ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇక ఈ సినిమా తరువాత అనుష్క ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటించేందుకు ఓకె చెప్పిందని తాజా సమాచారం. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో అనుష్కసినిమా చేయబోతుందన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో పట్టాలెక్కనుందట. మిలటరీ బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు పక్క స్క్రిప్ట్ తో సిద్దంగా ఉన్నాడట గౌతమ్‌ మీనన్‌. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క భారీ పోరాట సన్నివేశాల్లో నటించనుందని లేటెస్ట్ న్యూస్. అందుకోసం ఇప్పటి నుంచే ఆమె ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. జనవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలో అనౌన్స్ చేయనున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: