ఈ మద్య సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో సంచలనాలు జరుగుతున్నాయి.  సోషల్ మీడియా పుణ్యమా అని సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు దర్శక, నిర్మాతలు ఎన్నో టెన్షన్స్ కి గురి అవుతున్నారు. లీకేజ్ రాయుళ్లు ఎప్పుడు ఏం లీక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంటుంది.  చిన్న, పెద్దా సినిమా అనే తేడా లేకుండా థియేటర్లో పడ్డ గంటల్లోనే నెట్ లో లీక్ చేస్తూ చావుదెబ్బ కొడుతున్నారు.  ఇక షూటింగ్ లోకేషన్స్ సంగతి సరేసరి.. ఫస్ట్ లుక్ ని ఎంతో ఆర్భాటంగా రిలీజ్ చేద్దాం అనుకునే లోపు లీక్ చేస్తున్న అభిమానులను నిరాశపరుస్తున్నారు.  ఆ మద్య సైరా సినిమా, మహర్షి రిలీజ్ కి ముందు కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు లీక్ చేశారు.  సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీకి సంబంధించిన లోకేషన్లు లీక్ చేశారు.  

 

ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించిన స్పాట్ లోకేషన్ ఫోటోలు లీక్ కావడం చిత్ర యూనిట్ ని కలవరపరుస్తున్నాయి.  అసలే షూటింగ్ లో ఇబ్బందులు.. ఆపై ఫోటో లీకులతో చిత్ర యూనిట్ కి మింగుడు పడకుండా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ మన్యం వీరుడు కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాత్ర ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు.  ఇదే సమయంలో ఈ పాత్రకు సంబంధించిన ఫోటో, వీడియో ఒకటి లీక్ కావడంతో షాక్ తిన్నారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ వేసుకున్న దుస్తులు, హెయిర్ స్టైల్, మీసం అన్ని ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి.  

 

అయితే షూటింగ్ సమయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. స్పై కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టినప్పటికీ ఎవరో ఒకరు ఈ ఫోటో, వీడియో లీక్ చేశారు. ఆ వీడియో లీక్ అయిందని రాజమౌళి ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వచ్చాయి.  తాజాగా మరో ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ అభిమానితో ఈ ఇద్దరు హీరోలు ఫోటో దిగారు. ఆ ఫొటోతో పాటు రాంచరణ్, ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా వెనుకనుంచి తీసిన ఫోటో వైరల్ గా మారింది.  రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా నటిస్తున్నారు. ఈ సినిమా 2020, జూలై 30న విడుద‌ల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: