ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించినవే కాకుండా మోస్ట్ పాపులర్ అయిన వారిపై బయోపిక్ లు నిర్మిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు వరుసగా వస్తున్నాయి.   ఈ  నేపథ్యంలో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ 'ఛపాక్'. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో ప్రముఖ నటి దిపికా పదుకొనె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. దీపిక పదుకొనె నటించిన 'ఛపాక్‌' సినిమా చిక్కుల్లో పడ్డట్టు బాలీవుడ్ సమాచారం.  

 

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు ఈ తరహా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. సినిమా పూర్తయి రిలీజ్ కి ముందు కథ నాదే అంటూ నిర్మాతమండలిలో ఫిర్యాదు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథ తన దగ్గర నుండి కాపీ కొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ రాకేశ్ భర్తీ అనే రచయిత కోర్టుని ఆశ్రయించాడు. ఈ సినిమా కథను తానే రాసుకున్నానని, 'బ్లాక్ డే' పేరుతో రిజిస్టర్ చేయించుకున్నానని పేర్కొన్నారు. తాను రాసుకున్న కథకు అనుగుణంగానే 'ఛపాక్' మూవీలో సీన్స్ ఉన్నాయని,పలు కారణాల వలన సినిమా చిత్రీకరణ ఇంకా మొదలుపెట్టలేదని అన్నారు.

 

అప్పటి వరకూ ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని రాకేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతే కాదు ఈ చిత్ర రచయితగా తనకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.   అయితే ఈ విషయం గురించి మొదట చిత్ర నిర్మాతలను సంప్రదించినప్పటికీ, వారి నుండి ఎలాంటి స్పాదన రాకపోవడం వలనే కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని రాకేశ్ తెలిపారు. అటు సినిమా యూనిట్ కూడా ఇప్పటివరకూ స్పందించలేదుని రాకేశ్ వెల్లడించారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: