ప్ర‌తీ సంవ‌త్స‌రం సంక్రాంతికి కొత్త సినిమాలు రావ‌డం ఆన‌వాయితీ అయిపోయింది. సంక్రాంతి పండ‌గ మ‌న తెలుగు హీరోల‌కి ఎంత పెద్ద సెంటిమెంటో తెలియ‌నిది కాదు. అయితే ఈ సారి బ‌రిలో అల్లుఅర్జున్ `అల‌వైకుంపురంలో`, మ‌హేష్‌బాబు `స‌రిలేరునీకెవ్వ‌రు`, తో పాటు క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన `ఎంత‌మంచివాడ‌వురా` చిత్రాలు సంక్రాంతి బ‌రిలో విడుద‌ల కాబోతున్నాయి. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం `ద‌ర్బార్‌` కూడా విడుద‌లవుతోంది. ఈ సినిమాకి పెద్ద‌గా బ‌జ్ లేక‌పోయినా పెద్ద సినిమాల‌తో పాటు ధీటుగా విడుద‌ల‌వుతుంది క‌ళ్యాణ్‌రామ్ చిత్రం. 


 కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. 'శతమానం భవతి' లాంటి సినిమాతో సూపర్ హిట్ సాధించిన సతీష్ తన రెండవ సినిమా 'శ్రీనివాస కళ్యాణం' తో పూర్తిగా నిరాశపరిచాడు.   మరోవైపు కళ్యాణ్ రామ్ సినిమాలు యావరేజ్ గా నెట్టుకొస్తున్నాయి కానీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపే తరహా సినిమాలు మాత్రం రావడం లేదు.   దీంతో ఈ సినిమా పై పెద్దగా బజ్ ఏర్పడలేదు.  ఇక  'ఎంత మంచివాడవురా' టీమ్ కూడా ప్రమోషన్స్ విషయంలో పెద్దగా జోరు చూపించడం లేదు.   ఇవన్నీ ఇలా ఉంటే సంక్రాంతికి భారీ సినిమాల హంగామా ఎక్కువగా ఉంటుంది.  అందరి దృష్టి స్టార్ హీరోల పైనే ఉంటుంది. అది కూడా ఈ సినిమాపై జనాల ఫోకస్ తక్కువగా ఉండడానికి మరో కారణం.

అయితే ఇలాంటి అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ సినిమాను తక్కువగా అంచనా వేయలేం.  ఈ సినిమా సూపర్ హిట్ గుజరాతి సినిమాకు రీమేక్. అంటే మంచి కంటెంట్ ఉంది.  దీనికి తోడు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న కుటుంబకథా చిత్రం. గత కొన్నేళ్ళుగా సంక్రాంతి హిట్లను పరిశీలిస్తే 'సోగ్గాడే చిన్ని నాయన'.. 'శతమానం భవతి'.. 'జైసింహా'.. 'F2'..  ఇలా  అంచనాలు తక్కువగా ఉన్న సినిమాలే సంక్రాంతి సీజన్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి.  ఈ సెంటిమెంట్ కనుక మరోసారి రిపీట్ అయితే నందమూరి హీరో బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటడం ఖాయం.  ఈ విషయం తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడకతప్పదు. ఈ సెంటిమెంట్ విష‌యం బాగానే ఉంది కానీ ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్ అయితే రాని  కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంతో ఒక్క‌సారిగా సంక్రాంతి స్టార్ హీరో అయిపోతాడా అన్న వాద‌న కూడా మ‌రోవైపు వినిపిస్తోంది. క‌ళ్యాణ్రామ్ సెంటిమెంట్ ఏమాత్రం వ‌ర్క్ అవుట్ అవుద్దో చూద్దాం మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: