అభిమానం అనేది మనసులో నుంచి రావాలి. ఒక్కసారి ఎవరిని అన్నా అభిమానిస్తే వాళ్ళ కోసం ఎమన్నా చేయాలనిపిస్తుంది.. ఒకళ్ళ మీద అభిమానం రక్త సంబంధంతోనే ఉండదు.. మనకి ఏమి కాని వాళ్ళ మీద కూడా ఉంటుంది.. మనం హీరోలని ఎంతగానో అభిమానిస్తాము.. వాళ్ళని తెరపై చూసి మాత్రమే ఫ్యాన్స్ అవుతాము.. వాళ్ళకోసం ఎమన్నా చేయాలనిపిస్తుంది.

 

అంత పిచ్చి వాళ్లంటే... అలాంటాది మనం అభిమానించే హీరోలు మనల్ని కలిసిన, మనతో మాట్లాడిన, ఫొటోస్ దిగిన అ ఫీలింగే వేరు కదా!!! అలాంటి ఓ అనుభూతి ఒక మహిళా అభిమాని కి దక్కింది.. ఏకంగా వాళ్ళతో బ్రేక్ ఫాస్ట్ కూడా చేసింది..ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

 

వాళ్ళు ఎవరో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే... ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ప్రస్తుతం బిజీగా ఉన్న ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తేజ్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే కదా. ఆ స్నేహం కారణంగా వీళ్లిద్దరు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

 

ఈ చిత్రంలో రామ్ చరణ్.. "అల్లూరి సీతారామరాజు" పాత్రలో నటిస్తే.. తారక్ "కొమరం భీమ్" పాత్రలో కనిపించనున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న  విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక మహిళా అభిమాని తాను ఎంతగానో అభిమానించే రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే ఫోటో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది... ఈ బడా హీరోస్ తో కలిసి హోటల్ లో ఉన్న మహిళా అభిమాని గూర్చి వివరాలు ఇంకా తెలియలేదు. అభిమానికి తమతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం కల్పించిన రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ లా గొప్పతనానికి సోషల్ మీడియా లో ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: