బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా హీరోయిన్స్ బికినీ బీచ్ సెలబ్రేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందాల చందమామ కాజల్ మాల్దీవుల విహారంలో సేద దీరుతున్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత తనకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేందుకు రేర్ ఛాన్స్ దొరికిందట. అంతే ఇంకేం ఉంది.. ఓవైపు బికినీ బీచ్ సెలబ్రేషన్ .. మరోవైపు స్విమ్మింగ్ పూల్ సెలబ్రేషన్ .. దేనికైనా సై అనేస్తోంది. ఇప్పటికే కాజల్ బికినీ ఫోటోలు యువతరంలో జోరుగా వైరల్ అయ్యాయి. మూడు పదులు దాటినా కాజల్ అందాలు చూడటానికి మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆవురావురు అంటూ ఎదురు చూస్తుంటారు. అందుకే కాజల్ కూడా కొత్తగా టూ పీస్ బికినీతో తన ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ గ్లామర్ అండ్ సెక్సీ ట్రీట్ ఇస్తోంది.

 

అంతేకాదు ప్రతి గంటకు ఓ కొత్త ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జనాలకు అంతకంతకు హీట్ పెంచేస్తోంది. ఇక తాజాగా బీచ్ ఇసుక తిన్నెల్లో స్పెషల్ వైన్ పార్టీతో కాజల్ ఫుల్ ట్రీట్ కి రెడీ అవుతున్న ఫోటో రిలీజైంది. పింక్ ఫ్రాకులో చందమామ ఎంతో సింపుల్ గా కనిపిస్తోంది. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. ఈలోగానే వైన్ పార్టీకి సిద్ధమైందని ఆ యాంబియెన్స్ చెబుతోంది. అసలే కుల్ వెదర్..ఇక వైన్ పార్టీ అంటే అమ్మడి టేస్ట్ కి తగ్గట్టు ఎలాంటి యాంబీషియన్స్ ని ఆర్డర్ చేసి ఉంటుందో ఈ సాంపిల్స్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. 

 

అన్నట్టు ఆ బీచ్ లో వైట్ సాండ్ ఎంతో స్పెషల్ గా తళతళా మెరుస్తోంది. అంతకుమించి చందమామ అందం పదింతలు వికసిస్తోంది. ఇంతకీ కాజల్ సేవిస్తున్న ఆ వైన్ బ్రాండ్ ఏమిటో! అంటూ మందుబాబులు ఒకటే ఆరా తీస్తున్నారు. అసలే క్రెడిట్ కార్డ్ ని ఆ పక్కన టేబుల్ పైకి విసిరేసింది. పార్టీ అంటే అన్ లిమిటెడ్ ఆఫర్! అన్నట్టుగానే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఇంతకీ ఈ పార్టీ కోసం కాజల్ ఎంత బిల్లు చేసిందో ఏమిటో! ఓవరాల్ గా మాల్దీవుల విహారానికి ఎంత ఖర్చు చేసి ఉంటుంది. తన సోదరి నిషా అగర్వాల్ సహా అక్కడ ల్యాండ్ అయ్యింది. మొ త్తానికి కాజల్ బికినీ షో కంటే కూడా తను ఎంత బిల్లు కడుతుందోనన్న ఆసక్తే జనాలలో ఎక్కువగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: