ఎక్కువగా బాలీవుడ్ లో స్టార్ హీరో ప్లేబోయ్ వేషాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒకే బెడ్ పై ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ దొరికి పోయిన హీరోగారి నిర్వాకం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? అనుకుంటున్నారా ..! బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి పరిచయం అవసరం లేదు. ప్లేబోయ్ వేషాలకు అయ్యగారు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. 'లవ్ ఆజ్ కల్' (తెలుగులో తీన్ మార్) లాంటి ప్రేమకథా సినిమాతో యూత్ లో ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ హీరో. ప్రస్తుతం సైఫ్ నటిస్తున్న 'జవానీ జానేమన్' మరో రొమాంటిక్ కథాంశంతో వస్తోంది. 

 

టబు - అలియా ఫర్నిచర్ వల్లా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7 న విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ తేదీ మారింది. 31 జనవరి 2020 న అనుకున్న డేట్ కాస్త అడ్వాన్స్ డ్ గానే థియేటర్ల లోకి రాబోతోంది. తాజా గా నిర్మాతల్లో ఒకరైన జాకీ భగ్నాని మొదటి పోస్టర్ ను షేర్ చేస్తూ.. కొత్త తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్ లో ప్లేబోయ్ సైఫ్ ఇద్దరు బ్యూటీలతో మంచంపై పడుకుని ఉన్న పోస్టర్ జనాల్లో హీట్ పెంచేస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో రొమాన్స్ పీక్స్ లో ఉండబోతోందని అర్థమవుతోంది. 

 

ఇక ఈ సినిమాతోనే పూజా బేడి కుమార్తె అలియా ఫర్నిచర్ వల్లా పరిచయం అవుతోంది. తను సైఫ్ కుమార్తె గా నటిస్తోంది. జవానీ జానెమన్ను సైఫ్ బ్యానర్ బ్లాక్ నైట్ ఫిల్మ్స్- నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్ - పూజా ఎంటర్ టైన్ మెంట్ (జాకీ భగ్నాని) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందించిన సినిమా అయినప్పటికి రొమాన్స్ ప్లేబోయ్ యాక్టివిటీని రివీల్ చేయడంతో టీమ్ సినిమాపై ఉత్కంఠను పెంచింది.

 

ఇక జానెమన్ రిలీజ్ తేదీ మారడంతో మరో మూడు సినిమాలతో పోటీ తప్పడం లేదు. హిమేష్ రేషమ్మియా తొలిసారిగా డబుల్ రోల్ లో నటించిన 'హ్యాపీ హార్డీ అండ్ హీర్' అదే రోజు రిలీకి సిద్దమవుతోంది. సోనియా మన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా దేశ్ ముఖ్ - సబితా మనక్ చంద్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే అదే రోజు రాజ్కుమార్ రావు- నుస్రత్ భారుచ నటించిన 'చలాంగ్' .. హినా ఖాన్ ప్రధాన పాత్రలో విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన 'హ్యాక్' కూడా విడుదలవుతున్నాయి. మరి ఈ సినిమాలతో పోటీ తట్టుకొని ఈ సీనియర్ ప్లే బాయ్ నిలబడతాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: