టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. మహేష్ బాబు మేజర్ అజేయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు, అలానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో విపరీతమైన రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 

సీనియర్ నటి విజయశాంతిసినిమా ద్వారా చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో తప్పకుండా సినిమా సక్సెస్ అవడం ఖాయం అని మెజారిటీ ప్రేక్షకులు నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్బ్ గా రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సాంగ్స్ కు మాత్రం ఒకింత మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం షూర్ షాట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ రెండు రోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకుని ఉండడంతో పాటు, 

 

మరోవైపు తన కెరీర్ లో తీసిన నాలుగు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లు అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమా దర్శకుడు కావడం అని, అయితే సాంగ్స్ ఒకింత కొందరిని నిరాశపరిచినప్పటికీ కూడా, అవి సినిమా తెరపై ఎంతో అద్భుతంగా ఉంటాయని, ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్మెంట్ గా సాగె ఈ సినిమా, సెకండ్ హాఫ్ లో ఎక్కువగా రేసీ స్క్రీన్ ప్లే తో మధ్యలో అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, ఇక మహేష్ ఫ్యాన్స్ ఆయన నుండి ఆశిస్తున్న ఫుల్ కామెడీ, మాస్ అంశాలతో పాటు అన్నిరకాల కమర్షియల్ హంగులు జత చేసాడట దర్శకుడు అనిల్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియదుగాని, ఒకవేళ ఇదే విధంగా కనుక సినిమా తెరకెక్కితే, సూపర్ స్టార్ ఖాతాలో మరొక సూపర్ డూపర్ హిట్ పడ్డట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: