టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులతో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేయటం జరిగిందో అదిరిపోయే హిట్ కొట్టడం ఒక్కసారిగా అమాంతం మళ్లీ తన పూర్వ వైభవం సంతరించుకున్నాడు రామ్ పోతినేని. చాలా కాలం తర్వాత హిట్టు పడటంతో తన తర్వాత సినిమా 'రెడ్' కోసం రెట్టించిన ఉత్సాహంతో రామ్ రెడీ అయ్యాడు. ‘నేను శైలజ’ ఫేం డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్రవంతి రవికిషోర్ స్రవంతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.

 

ఇటువంటి నేపథ్యంలో ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సన్నివేశాల్లో రామ్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారట. రామ్ ఎంత ఎనర్జిటిక్ అయినప్పటికీ రామ్ కు ఛాలెంజింగ్ గా ఉండే యాక్షన్ సీన్స్ డిజైన్ చెయ్యడంతో రామ్ కు గాయాలు కూడా అవుతున్నాయట.  ఈ విషయం తెలుపుతూ రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేస్తూ "డియర్ పీటర్ హెయిన్.. మీరు నాకు ఇచ్చే పెయిన్ లాగే మీకు నామీద ఉండే ప్రేమను ఫీల్ కాగలం కానీ చూడలేం. నోట్:రషెస్ ఇప్పుడే చూశాను. మైండ్ బ్లోయింగ్" అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో రామ్ తన గాయాలను చూపిస్తూ "హే పీటర్ హెయిన్ నువ్వు నిన్న డిజైన్ చేసింది గ్రేట్ ఫైట్.

 

నిన్ను నేను అసలు మిస్ కావడం లేదని చెప్పడానికే ఈ వీడియో చేశాను" అన్నాడు. మొత్తం మీద నా ఒళ్లు హూనం చేశావు పీటర్ హెయిన్స్ అని రామ్ పోతినేని తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ డబల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ కి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: